థర్మకోల్ గదులంటా! - TELANGANA
ఇల్లు కట్టాలంటే... పిల్లర్లు వేయాలి.. ఇటుకలు పేర్చాలి... నెలల తరబడి శ్రమించాలి. ఇవేవీ అవసరం లేకుండా థర్మాకోల్తోనే బడుల్లో అద్భుతమైన గదులు నిర్మించేందుకు నడుం కట్టింది రాష్ట్ర విద్యాశాఖ.
ఈ గదికి ఇటుకల్లేవ్...!
సైన్స్ ఫెయిర్‌లో చిన్నారులు థర్మాకోల్‌తో చేసిన భవనాల్ని చూసి నిజమైనవి కూడా ఇంతే సులభంగా నిర్మించగల్గితే బాగుండు అనుకుంటాం. తెలంగాణ విద్యాశాఖ దాన్ని నిజం చేస్తోంది. థర్మాకోల్‌ని ఉపయోగించి ఆధునిక పరిజ్ఞానంతో తరగతి గదులు నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో ఓ నమూనా గదిని నిర్మిస్తోంది. నిపుణులు ఆమోదిస్తే... రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా నిర్మాణాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అసలు ఆ నిర్మాణ విధాన ప్రత్యేకతలేంటో మీరూ చూడండి.
ఇవీ చూడండి:ఒత్తిడే కారణమా..?
Last Updated : Mar 3, 2019, 3:25 PM IST