ETV Bharat / state

Skating Player Rishita Story : 'స్కేటింగ్​లో రాణించింది.. మానసిక వైకల్యాన్ని జయించింది'

Rishita won medals in Berlin Special Olympics : ఓ చిన్నారి పుట్టుక ఆ కుటుంబానికి సవాల్​గా నిలిచింది. అయినా విధిని ఎదిరించి ఆ చిట్టి తల్లి ప్రాణం పోసుకుంది. తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా పెరిగింది. రెండేళ్లపాటు నోటమాట రాలేదు. బుడి బుడి అడుగుల చప్పుడు ఆ ఇంట కనిపించలేదు. మానసిక వైకల్యంతో బాధపడుతూనే క్రమంగా పెరిగి పెద్దదైంది. తమ గారాల పట్టీ నుదుట దేవుడు రాసిన రాతను మార్చాలని నిర్ణయించుకున్న ఆ పాప తల్లి.. అందరి పిల్లల్లాగే తన పాపను చూడాలనుకుంది. స్పెషల్ కేర్ స్కూల్​లో చదివిస్తూనే రోలర్ స్కేటింగ్​లో శిక్షణ ఇప్పించింది. ఇప్పుడు ఆ చిన్నారి జర్మనీలో జరిగిన ప్రత్యేక ఒలంపిక్స్​లో రెండు రజత పతకాలు సాధించి దేశం గర్వించేలా చేసింది.

Roller Skating Player Rishita
Roller Skating Player Rishita
author img

By

Published : Jul 10, 2023, 5:37 PM IST

బెర్లిన్‌ స్పెషల్‌ ఒలంపిక్స్‌లో రజతాలతో సత్తా చాటిన రిషిత

Roller Skating Girl Rishita Life Story : మానసిక వైకల్యం, అందులోనూ గుండెకు రంధ్రంతో పుట్టిన రుషిత కథ ఇది. బీహెచ్ఈఎల్​కు చెందిన రిషితకు ఆరోగ్యపరంగా సమస్యలున్నా ఆమెను తల్లిదండ్రులు మాధవి, ప్రశాంత్ రెడ్డిలు కంటికి రెప్పలా కాపాడుతూ నచ్చిన క్రీడల్లో శిక్షణ ఇప్పించారు. వారి కలలు, ఆశయాలకు అనుగుణంగా రిషిత ఇటీవల జర్మనీలోని బెర్లిన్​లో జరిగిన ప్రత్యేక ఒలంపిక్స్​లో సత్తా చాటింది. రోలర్ స్కేటింగ్ స్ట్రైయిట్ లైన్ విభాగంలో రెండు రజత పతకాలు సాధించి దేశఖ్యాతిని ఇనుమడింపజేసింది.

190 దేశాల నుంచి 7 వేల మంది అథ్లెట్లు 26 క్రీడల్లో పాల్గొన్న ఈ ఒలంపిక్స్​లో 20కిపైగా దేశాల క్రీడాకారులు రోలర్ స్కేటింగ్​లో పోటీపట్టాడరు. అందులో 30 మీటర్ల లక్ష్యాన్ని 28.71 సెకన్లలో పూర్తి చేసిన రిషిత.. రజత పతకం సాధించి శభాష్ అనిపించుకుంది. రిషిత తండ్రి ప్రశాంత్ ఓ ఫార్మా కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తుండగా తల్లి మాధవి టైలరింగ్ చేస్తూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు తొలిసంతానంగా కవలలు పుడతారనుకుంటే గర్భంలోనే మగపిల్లాడు చనిపోయాడు.

ఆ ప్రభావం రిషితపై పడి డౌన్ సిండ్రోమ్ సమస్య తలెత్తింది. పుట్టిన 9నెలలకే పాప గుండెలో రంధ్రం ఉన్న సంగతి వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా మారింది. ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ దాతృత్వంతో చికిత్స చేయించి పాపను కాపాడుకున్నారు. స్థానికంగా ఉన్న స్పెషల్ కేర్ స్కూల్​లో చదివిస్తున్నారు. ఈ క్రమంలోనే తల్లి మాధవి రిషితకు బీహెచ్ఈఎల్​లోని తెలంగాణ స్పోర్ట్స్ డైరెక్టర్ రెహమాన్ వద్ద రోలర్ స్కేటింగ్​లో శిక్షణ ఇప్పించింది. రెహమాన్ రిషితలోని ప్రతిభను గుర్తించి ప్రతీ రోజూ బీహెచ్ఈఎల్​లోని మైదానంలో శిక్షణ ఇస్తున్నారు.

"నేను చెన్నైలో ప్రాక్టీస్ చేశాను. నాకు మంచిగా స్కేటింగ్​ వస్తోంది. స్కేటింగ్​లో అసలు భయం లేదు. నాకు ట్రైనింగ్​ ఇచ్చిన గురువులందరికి కృతజ్ఞతలు. నా విజయం మా నాన్న, అమ్మ, చెల్లికి ఇస్తున్నా. గోల్డ్​ మెడల్​ సాధిస్తానని నమ్మకం ఉంది".- రిషిత, రోలర్ స్క్రేటింగ్ క్రీడాకారిణి

Roller Skating Player Rishita Profile : అహ్మదాబాద్, దిల్లీలోని పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. దీంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బెర్లిన్​లో జరిగే స్పెషల్ ఒలంపిక్స్​లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. ఆ పోటీల్లో పాల్గొన్న రిషిత.. తన శక్తి సామర్థ్యాల మేరకు రెండు రజత పతకాలు సాధించి తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టింది. జూన్ 17 నుంచి 25 వరకు అక్కడే ఉన్న రిషిత.. గత వారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. ప్రత్యేక ఒలంపిక్స్​కు ఒంటరిగా వెళ్లి చక్కటి ప్రతిభను కనబర్చిన రిషితకు స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

ఆరోగ్యం సహకరించకున్నా ఎంతో పట్టుదలతో విజేతగా నిలిచిన రిషిత ప్రతిభను ప్రశంసిస్తూ భవిష్యత్​లో తనకు ఎలాంటి సహకారానైనా అందించేందుకు సిద్ధమంటున్నారు. లోయర్ హెబిలిటీలో చక్కటి ప్రతిభను చూపిన రిషిత.. మొదట్లో ఎంతో ఇబ్బందిపడిందని కోచ్ రెహమాన్ చెబుతున్నారు. భవిష్యత్​లో సాధారణ పిల్లల తరహాలోనే రిషిత కూడా 100 మీటర్లు, 200 మీటర్లు స్కేటింగ్ చేయగలదనే నమ్మకాన్ని రెహమాన్ వ్యక్తం చేస్తున్నారు.

క్రీడల ద్వారా ఇలాంటి చిన్నారులను సాధారణ స్థితిలోకి తీసుకురావచ్చని చెబుతున్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రిషిత.. భవిష్యత్​లో మంచి క్రీడాకారిణిగా ఎదిగేందుకు ప్రభుత్వాలు తమ చిన్నారికి చేయూత నివ్వాలని రిషిత తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తనకు మరింత ప్రోత్సాహానిస్తే దేశానికి బంగారు పతకాన్ని తీసుకొస్తానంటోంది రిషిత. ఈ చిన్నారి ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.

"చిన్నప్పటి నుంచి చా చిట్టి తల్లి చాలా ఇబ్బందులు పడింది. సమాజంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ విజయం సాధించిన తరువాత అవన్నీ మరచిపోయాం. దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తే ఇంకా మంచి విజయాలు సాధిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నాం".- మాధవి, రిషిత తల్లి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.