Robotics services at Kims Hospital: అత్యాధునిక సాంకేతికతతో కూడిన శస్త్రచికిత్సల్లో కిమ్స్ ఆసుపత్రి మరోసారి సరికొత్త శకాన్ని ఆవిష్కరించింది. మోకాలి మార్పిడి, తుంటి మార్పిడి శస్త్రచికిత్సల్లో ప్రపంచంలోనే తొలిసారిగా ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోను తక్కువ ఖర్చుతో, అత్యుత్తమ రికవరీ రేటుతో రోగులు తిరిగి కోలుకొనే విధంగా సహాయపడే సరికొత్త రోబోను కిమ్స్ ఆసుపత్రి ఈరోజు హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో ఆవిష్కరించింది.
ఈ సందర్భంగా ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైన రోబో విశేషాలను కిమ్స్ ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి సాయిలక్ష్మణ్ వివరించారు. కువిస్ పేరుతో పిలువబడుతున్న ఈ రోబోతో.. శస్త్రచికిత్స చేసిన రోగులు కోలుకోవడానికి ఎంతో సమయం పట్టదని వివరించారు. దీనితో శస్త్రచికిత్స చేస్తే రక్తం ఎక్కువగా కోల్పోకుండా అరికట్టవచ్చని కిమ్స్ ఆసుపత్రి ఛైర్మన్ బొల్లినేని భాస్కరరావు తెలిపారు. కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో అడ్వాన్స్డ్ రోబోటిక్ సెంటర్ పేరుతో ఈ రోబోను ఆవిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి ఛైర్మన్, సినీ నటుడు సుధీర్‌బాబు, నటి చాందినీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: