ETV Bharat / state

సైన్స్‌ సొసైటీ వినూత్న ప్రయోగం.. రోబోటిక్ శానిటైజ‌ర్ తయారీ

హైదరాబాద్ సైన్స్‌ సొసైటీ సరికొత్త రోబోటిక్ శానిటైజ‌ర్ రూపొందించింది. ఆస్పత్రులు, కార్యాలయాలు ఇత‌ర ప్రదేశాల్లో సులువుగా శానిటైజేషన్ చేసేందుకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దారు. రిమోట్‌తో వంద మీటర్ల దూరం నుంచే ఈ యంత్రాన్ని ఆపరేట్‌ చేయవచ్చు. గ‌వర్నర్ త‌మిళిసై ప్రశంశలు అందుకున్న ఈ యంత్రాన్ని మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.

author img

By

Published : Sep 2, 2020, 7:23 AM IST

robotic sanitizer
రోబోటిక్ శానిటైజ‌ర్
రోబోటిక్ శానిటైజ‌ర్

క‌రోనా నేప‌థ్యంలో ఆసుప‌త్రులు, కార్యాల‌యాలు వంటి ప్రదేశాల్లో ప్రతిరోజూ శానిటైజ్ చేయాల్సిన పరిస్థితి. క‌రోనా వార్డులు, ఐసోలేషన్‌ సెంటర్లలో శానిటైజ్ చేస్తున్న వారు ఇప్పటికే చాలా మంది వైర‌స్ బారిన ప‌డ్డారు. ఇలాంటి ప్రదేశాల్లో మాన‌వ ర‌హిత శానిటైజ‌ర్‌ పిచికారీ చేసే విధంగా రోబోటిక్‌ శానిటైజర్‌ను హైదరాబాద్ సైన్స్‌ సొసైటీ త‌యారు చేసింది. రిమోట్‌ సాయంతో పనిచేసే ఈ రోబో 5 నుంచి 6 అడుగుల ఎత్తులో 360 డిగ్రీల్లో నలుమూలలా శానిటైజ్‌ చేస్తోంది. గదిలోకి వెళ్లకుండా రిమోట్‌ సాయంతోనే దీనిని వినియోగించవచ్చు.

ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రెండు గంటలపాటు ప‌ని చేస్తుంది. పెద్ద పెద్ద ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోనూ దీనిని వాడుకోవచ్చు. గ‌వ‌ర్నర్ త‌మిళ‌సై కూడా ఈ ప్రయోగాన్ని చూసి ప్రశ‌సించారని... మరికొన్ని మార్పులు చేసి తర్వలో మార్కెట్‌లోకి ప్రవేశ పెడతామని సోసైటీ సభ్యులు తెలిపారు. సైనికులకు ఉపయోగపడే బోర్డర్‌ రోబోటిక్‌ సర్వేలైన్స్‌ వెహికిల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని తెలిపారు.

కరోనా బారినుంచి ప్రజలను రక్షించడానికి తమవంతు సాయంగా రోబోటిక్ పరికరాలను తయారు చేస్తున్నట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.

ఇదీచూడండి.. ' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.