ETV Bharat / state

దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​ - crime news at hyerabad

హైదరాబాద్ సిరిపురం ప్రాంతంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను కార్ఖానా పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి బంగారు ఆభరణాలు, సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్​, నగదును స్వాధీనం చేసుకున్నారు.

robbery-gang-arrest-by-karkhana-police-at-hyderabad
దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​
author img

By

Published : Mar 20, 2020, 10:11 AM IST

తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను కార్ఖానా పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్​, నగదును స్వాధీనం చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే?

హైదరాబాద్​ సిరిపురం ప్రాంతంలో సాయి శ్రీనివాస్​రెడ్డి కాంప్లెక్స్​లో 104వ ప్లాట్​లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల నెల్లూరులో శుభకార్యానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అదే అదునుగా భావించి దార్ల చందు, రాకేష్, వినోద్ కుమార్ అనే వ్యక్తు​లు ఇంటి తాళాలు పగలగొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి, సామగ్రి, నగదు, చరవాణిలను అపహరించారు. అదే అపార్ట్మెంట్​లోని మరో ఇంట్లో చోరీకి ప్రయత్నం చేశారు.

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వీరిని మల్కాజిగిరి ప్రాంతంలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​

ఇవీ చూడండి: 'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.