వాహనదారులు రోడ్డుపై ప్రయాణించే సమయంలో శిరస్త్రాణం ధరించాలని, కార్లల్లో వెళ్లేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని ఉత్తర మండలం ట్రాఫిక్ ఏసీపీ రంగయ్య సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ మహబూబ్ హైస్కూల్‌లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
అతి వేగంగా వాహనాన్ని నడిపితే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని... ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్‌ను పాటించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. కొంతకాలంగా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించడం వల్ల ప్రమాదాలు తగ్గాయని ఆయన అన్నారు.
ప్రమాదాలు జరిగిన తీరు... తదనంతర పరిణామాలను విద్యార్థులకు ఆడియో, వీడియోల రూపంలో ప్రదర్శించారు. ఇతర దేశాల్లోని ట్రాఫిక్ వ్యవస్థను కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఇవీ చూడండి : వాహన చోదకులు తప్పని సరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలి