ETV Bharat / state

మితిమీరిన వేగం... రెండు నిండు ప్రాణాలు బలి

అతి వేగం... నిబంధనలు పాటించకపోవడం... వంటి కారణాల వల్ల రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 నెలల బాలుడితో పాటు... బాలుడి అమ్మమ్మ మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మితిమీరిన వేగంతో మైనర్లు కారు నడిపి ఆటోను ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

మితిమీరిన వేగం... రెండు నిండు ప్రాణాలు బలి
author img

By

Published : Aug 19, 2019, 6:28 AM IST

Updated : Aug 19, 2019, 9:57 AM IST

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి... మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని... ఒక వైపు పోలీసు ఉన్నతాధికారులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ వారి తల్లిదండ్రులకు ఇవేమీ పట్టడం లేదు. ఈ కారణంగా ఇతర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా బోయిన్‌పల్లి ప్రాంతంలో బాలురు కారును మితిమీరిన వేగంతో నడుపుకుంటూ వచ్చి ఆటో, రెండు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టారు. ఆటో నుజ్జనుజ్జు కాగా... కారు పల్టీలు కొట్టి పూర్తిగా ధ్వంసమైంది. కూకట్‌పల్లికి చెందిన నాగమణి, కుమార్తె సంధ్య, ఇద్దరు మనవళ్లతో కలిసి ఆటోలో స్వర్ణధామానగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

అతివేగం.. అనర్థం

మితిమీరిన వేగంతో కారు నడుపుకుంటూ వచ్చిన బాలురు​ మొదట ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నాగమణితో పాటు ఆమె ఇద్దరి మనవలు, కుమార్తె సంధ్య తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా కొద్ది సేపటికే బాలుడు మహాదేవ్‌ మృతి చెందాడు. చికిత్స పొందుతూ నాగమణి మృతి చెందింది. సంధ్యతో పాటు మరో బాలుడు మాధవ్‌ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో ఆటోను ఢీ కొట్టిన కారు మరో ఇద్దరు ద్విచక్ర వాహనదారులను ఢీ కొట్టింది. వారు కూడా గాయాలపాలయ్యారు.

మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలి

తమ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. పోలీసులు కేవలం కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా మైనర్లు వాహనాలు నడపకుండా చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మద్యం సేవించి కారు నడిపారా లేక అతి వేగమే కారణమా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

మితిమీరిన వేగం... రెండు నిండు ప్రాణాలు బలి

ఇవీ చూడండి: మిగిలిన బిల్లు చెల్లించండి..మృతదేహాన్ని తీసుకెళ్లండి

Last Updated : Aug 19, 2019, 9:57 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.