హైదరాబాద్ గుడి మల్కాపూర్ కూడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ఢీ కొని మహిళ ఘటనా స్థలిలోనే మృతి చెందింది. మృతురాలు ప్రైవేటు ఉద్యోగిని జానకిగా గుర్తించారు. ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి కార్యాలయానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఇదీ చూడండి: 'ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ'