ETV Bharat / state

కుమారుడికి తండ్రి ప్రేమను దూరం చేసిన లారీ అతివేగం - accident

లారీ డ్రైవర్ అతివేగం కన్నబిడ్డకు తండ్రి ప్రేమను దూరం చేసింది. కుమారుడిని చూడాలని ఎంతో ప్రేమతో ద్విచక్రవాహనంపై పయనమైన నవాజుద్దీన్​ను మితిమీరిన వేగంతో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

బైక్​ని ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి
author img

By

Published : May 4, 2019, 6:27 AM IST

Updated : May 4, 2019, 9:38 AM IST

హైదరాబాద్​ సరూర్​నగర్ మండలంలోని జలపల్లి గ్రామానికి చెందిన నవాజుద్దీన్ ద్విచక్రవాహనంపై శంకర్ పల్లిలోని తన భార్య పురుడు కార్యక్రమానికి బయలుదేరాడు. జన్​వాడ్ వేట్ వద్ద వేగంగా ప్రయాణిస్తున్న రెడిమిక్స్ లారీ అతనిని ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే నవాజుద్దీన్ మృతి చెందాడు. ప్రమాదాన్ని కళ్లార చూసిన స్థానికులు అటుగా వెళ్తున్న వాహనాలపై రాళ్లు రువ్వారు. పోలీసులతో కూడా వాగ్వావాదానికి దిగారు. విషయం తెలుసుకున్న నార్సింగ్ సీఐ రమణ గౌడ్ అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి

ఇవీ చూడండి: చెన్నైలో కారు బీభత్సం- మద్యం మత్తుకు ఇద్దరు బలి

Hyd_tg_65_03_Road accident 1dead Garshana_av_c6 note; feed from desk whatsapp. యాంకర్ :.... అతివేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న రెఢీమిక్స్ లారీ ఢీకొనడంతో బైకిస్ట్ అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన నగర శివారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి జన్ వాడ గేట్ వద్ద చోటుచేసుకుంది. ప్రమాద ఘటన ప్రత్యక్షంగా చూసిన స్థానికులు రెచ్చిపోయారు. అటుగా వెళ్తున్న రెఢీమిక్స్ లారీలతో పాటు , పోలీస్ వాహనం పోలీసులపై రాళ్ళ దాడికి పాల్పడ్డారు. ఇద్దరు పోలీసులకు స్వల్పంగా గాయపడ్డారు. దీనితో పరిస్థితి విషమిచడంతో రంగంలోకి దిగిన నార్సింగ్ సిఐ ఆందోళనకారులను చెదరగొట్టడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... సరూర్ నగర్ మండలంలోని జలపల్లి గ్రామానికి చెందిన నవాజుద్దీన్ శంకర్ పల్లికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే అతనికి 20 రోజుల క్రితం కుమారుడు జన్మించాడు. అతని పురుడు కార్యక్రమానికి. శంకర్ పల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. అయితే జన్ వాడ వేట్ వద్దకు రాగానే వేగంగా ప్రయాణిస్తున్న రెఢీమిక్స్ వాహనం బైక్ ను ఢీకొట్టింది. దీంతో నవాజుద్దీన్ సంఘటనా స్థలంలో మృతిచెందాడు. ఇది చూసిన స్థానికులు అటుగా వెళ్తున్న వాహనాలపై రాళ్ళ దాడికి దిగారు. పోలీసులపై కూడా ఓ దశలో వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న నార్సింగ్ సిఐ రమణ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బైట్ రమణ గౌడ్ ( సిఐ , నార్సింగ్ )
Last Updated : May 4, 2019, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.