లాక్డౌన్ దృష్ట్యా పనులు లేక, చేపల విక్రయాలు లేక ఆకలితో అలమటిస్తున్న 350 మంది గంగ పుత్రులకు 10 కిలోల బియ్యం, ఎన్ 95 మాస్కులను ఆదిత్య శ్రీకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ట్రస్ట్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర నాయకులు నందు కిషోర్ వ్యాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో చేపట్టారు. హైదరాబాద్ మాచిపురలోని జలక్ క్షత్రియ భవన్లో గంగపుత్రులకు అందించారు.
లాక్డౌన్తో చేపల వ్యాపారాలు లేక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న తమకు నందకిషోర్ సహాయం అందించడంపై గంగపుత్ర సంఘం అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ కొనసాగే వరకు తమ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తామని నంద కిషోర్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పరేటర్ పరమేశ్వరి సింగ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Kishan Reddy:'మోదీ ప్రభుత్వం కరోనాను సమర్థంగా ఎదుర్కొంది'