టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ్‌తోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేణుకా చౌదరి తదితరులు హాజరయ్యారు. ఆయా నియోజక వర్గాల నాయకుల నుంచి లోక్‌సభ ఎన్నికల వ్యూహలపై అభిప్రాయాలను సేకరించారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేయాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.
నేడు సమీక్షా సమావేశాలకు చివరి రోజు. చేవెళ్ల, మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.