కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల(Krishna River Management Board, Godavari River Management Board)తో కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష ముగిసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌లతో హైదరాబాద్ జలసౌధలో కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ సమావేశమయ్యారు. రెండు బోర్డుల పరిధి గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ పురోగతిని సమీక్షించారు. కార్యాచరణ పురోగతిని వివరించిన ఛైర్మన్లు... రెండు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు అందిన సమాచారం, వివరాలను కేంద్ర అదనపు కార్యదర్శికి తెలిపారు.
కేంద్ర జలశక్తిశాఖ జులై 15న జారీ చేసిన నోటిఫికేషన్ ఈ నెల 14 నుంచి అమల్లోకి రావల్సి ఉంది. ఈలోగా అందుకు సంబంధించి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే రెండు రాష్ట్రాల నుంచి పూర్తి సమాచారం ఇంకా బోర్డులకు అందలేదు. నిర్వహణ కోసం కావాల్సిన సమాచారం కూడా ఇవ్వలేదు. నోటిఫికేషన్‌లోని కొన్ని ప్రాజెక్టులను రెండో షెడ్యూల్ నుంచి తొలగించాలని రెండు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమలు కార్యాచరణ దిశగా ఇప్పటి వరకు జరిగిన కసరత్తు, రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం సహా అన్ని అంశాలపై దేబశ్రీ ముఖర్జీ.. బోర్డులతో పూర్తి స్థాయిలో సమీక్షించారు. సమీక్ష ఆధారంగా దేవశ్రీ ముఖర్జీ కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందించనున్నారు.
ఉపసంఘం ఏర్పాటు
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం ఇదివరకే గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన జీఆర్ఎంబీ(grmb) , కేఆర్ఎంబీ(KRMB) సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ స్థానంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. బోర్డు మీటింగ్ మినిట్స్‌తో పాటు ఉపసంఘాన్ని ప్రకటించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి ఉపసంఘానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై ఉపసంఘం ఎప్పటికప్పుడు చర్చించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి:
- GRMB & KRMB: 'ప్రాజెక్టుల నిర్వహణ కోసం అధికారులు, సిబ్బంది వివరాలను అందించాలి'
- GRMB: గోదావరి యాజమాన్య బోర్డు ఉపసంఘం ఏర్పాటు
- Ministry of Jal Shakti : 'కృష్ణా, గోదావరి'ని ఏం చేద్దాం? కేంద్రం తర్జనభర్జన!
- GRMB MEETING: ముందు కృష్ణా బోర్డు సంగతి తేల్చండి: తెలంగాణ
- Meeting: గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం ఇకపై తరచూ సమావేశాలు