Minister's displeasure: శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 80వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ పురోగతిని హరీశ్ రావు తెలుసుకున్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియపై బీఆర్కే భవన్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, టీఎస్పీఎస్సీ, పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు సహా నియామక సంస్థల అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
ఇప్పటి వరకు యాభై వేల వరకు ఉద్యోగాల నియామకాలకు అనుమతి ఇచ్చినట్లు ఆర్థికశాఖ అధికారులు తెలపగాా... అందులో సగం కూడా నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని పబ్లిక్ సర్వీసు కమిషన్ సహా నియామక సంస్థల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ 3 , గ్రూప్ 4, ఇంజనీర్ల నియామకం, గురుకులాలు సహా ఇతర నోటిఫికేషన్ల విషయంలో ఆలస్యం చేయవద్దని స్పష్టం చేశారు.
వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని, సర్వీసు నిబంధనలు సహా ఇతర అంశాలకు సంబంధించి ఏవైనా సవరణలు అవసరమైతే చేయాలని మంత్రి చెప్పారు. ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి జోన్లు, జిల్లాలు, సబ్జెక్టుల వారీగా పూర్తి వివరాలు వీలైనంత త్వరగా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి: