ETV Bharat / state

'మరో 2 రోజులు రెవెన్యూ కార్యాలయాలు బంద్​'

తహసీల్దార్​ను సజీవ దహనం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రెవెన్యూ ఉద్యోగుల ఐకాస డిమాండ్​ చేసింది. మరో రెండు రోజుల పాటు విధులు బహిష్కరించనున్నట్లు వెల్లడించింది.

author img

By

Published : Nov 5, 2019, 8:39 PM IST

'మరో 2 రోజులు రెవెన్యూ కార్యాలయాలు బంద్​'
'మరో 2 రోజులు రెవెన్యూ కార్యాలయాలు బంద్​'

తహసీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగుల ఐకాస డిమాండ్​ చేసింది. మరో రెండు రోజుల పాటు విధులు బహిష్కరించనున్నట్లు వెల్లడించింది. కార్యాలయాలను బంద్ చేసి కలెక్టరేట్ల ముందు రిలే నిరాహారదీక్షలు చేయాలని పిలుపునిచ్చింది. డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తహసీల్దార్ల సంఘం, వీఆర్ఓ, వీఆర్ఏల సంఘాలు, రెవెన్యూ సర్వీసెస్ సంఘంతో కూడిన ఐకాస ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

సీబీఐతో విచారణ జరిపించాలి..

విజ‌యారెడ్డి హ‌త్య రెవెన్యూ స‌మాజాన్ని తీవ్ర దిగ్భాంతికి గురి చేసిందని ఉద్యోగుల ఐకాస తెలిపింది. స‌జీవ ద‌హ‌నానికి దారి తీసిన అంశాల‌పై సీబీఐతో విచార‌ణ జ‌రిపించి... కుట్రదారులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేసింది. డ్రైవ‌ర్ గురునాథం కుటుంబంలో ఒక‌రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని కోరింది.

అన్ని రకాలుగా ఆదుకోవాలి

విజ‌యారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని ర‌కాలుగా ఆదుకోవాలని పేర్కొంది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే తదుపరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. డ్రైవర్ గురునాథం కుటుంబానికి రెవెన్యూ ఉద్యోగుల ఒకరోజు జీతాన్ని ఇస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల ఐకాస ప్రకటించింది.

ఇవీ చూడండి: తహసీల్దార్ విజయారెడ్డి​ సజీవ దహనంపై చంద్రబాబు ఆవేదన

02-11-2019 TG_HYD_53_02_PCC_SATHISHMADIGA_ON_RTC_AB_3038200 REPORTER : MALLIK.B CAM : SRINIVAS ( ) రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమై 29 రోజులవుతున్నా పరిష్కరించడంలో సర్కారు విఫమైందని పీసీసీ అధికార ప్రతినిధి సతీష్‌ మాదిగ అన్నారు. ఈ గందరగోళానికి ప్రధాన కారణం తెరాస, భాజపాలేని ఆక్షేపించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద దళిత, గిరిజన బాధితులకు రెండు పడకల గదుల ఇళ్ళు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఆరోపించారు. కొత్తగా ఏదో చేసినట్లు పక్కా ఇల్లు, 3 ఎకరాల భూమి ఇస్తామని, 5 వేల రూపాయల పింఛన్ ఇస్తామనడం సరికాదని, అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హయాంలోనే ఆ చట్టానికి సమగ్రంగా రూపకల్పన చేసి ప్రవేశపెట్టబడిందని గుర్తు చేశారు. దేశ ప్రజానీకం సంక్షేమం దృష్ట్యా... కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో చట్టాలు ఆమోదించి అమలు చేసిన ఘతన దక్కించుకుందని చెప్పారు. కాంగ్రెస్‌ హాయంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను మోదీ సర్కారు నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. VIS..........BYTE........... సతీష్‌ మాదిగ, పీసీసీ అధికార ప్రతినిధి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.