రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా మరో రెండు రోజులు విధులకు బహిష్కరించాలని... రెవెన్యూ ఐకాస నిర్ణయం తీసుకుందని ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తెలిపారు. అంతకు ముందు హైదరాబాద్‌లో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసిన రెవెన్యూ ఐకాస... తహసీల్దార్ విజయారెడ్డి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరింది. విజయారెడ్డి కుటుంబానికి భారీ పరిహారం ఇవ్వాలి విజ్ఞప్తి చేసింది. విజయారెడ్డి డ్రైవర్ గురునాథం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్మెట్లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా