Revenue Employees Meet KTR : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను.. రెవిన్యూ ఉద్యోగులు, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వేర్వేరుగా కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్-ట్రెసా నాయకులు వినతిపత్రం సమర్పించారు. రెవెన్యూ శాఖలో విధులు, పని భారాన్ని అనుసరించి నూతన కేడర్‌ను బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు.
TSRTC Chairman meet KTR : పదోన్నతులు, ధరణి సమస్యలు, వీఆర్ఏలకు పేస్కేల్ వంటి అంశాలపై కేటీఆర్‌కు వినతి పత్రం సమర్పించారు. రెండు రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ప్రభుత్వ హామీ మేరకు ఆర్టీసీలో యూనియన్లకు అనుమతికి, పేస్కేల్ అమలు, సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: