ETV Bharat / state

RevanthReddy on KCR: 'కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు'

RevanthReddy Comments on KCR : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర ప్రజల ప్రాణాలపై లేదని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. భారీ వర్షాలు, వరదలపై వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలను తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదని విమర్శించారు. వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా సీఎం కేసీఆర్‌ రాజకీయాలపై దృష్టిపెట్టారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

RevanthReddy
RevanthReddy
author img

By

Published : Jul 29, 2023, 3:59 PM IST

Updated : Jul 29, 2023, 4:21 PM IST

RevanthReddy Fires on KCR : కేసీఆర్‌, కేటీఆర్‌కు ప్రజల ప్రాణాలంటే పూచిక పుల్లతో సమానమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం వరదలతో అతలాకుతలం అయిందని చెప్పారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నా తెలంగాణ సర్కార్‌ పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

RevanthReddy Comments on KTR : కేసీఆర్ వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా రాజకీయాలపై దృష్టి పెట్టారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేటీఆర్ పార్టీల్లో మునిగిపోయారని విమర్శించారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. 30 మంది చనిపోయినా ముఖ్యమంత్రి పరామర్శించలేదని అన్నారు. వరద బాధితులను సీఎం ఎందుకు పరామర్శించడానికి వెళ్లలేదని ప్రశ్నించారు. కేంద్రం తాత్కాలిక వరద సాయం కింద రాష్ట్రానికి రూ.1,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వరద సాయం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డిపై ఉందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

RevanthReddy on Telangana Floods : వరదల్లో నష్టపోయిన వారికి.. ప్రభుత్వం తాత్కాలిక పరిహారంగా రూ.15,000 ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని అన్నారు. ఇసుక మేటలతో నిండిన వ్యవసాయ భూములకు రూ.20,000 ఇవ్వాలని పేర్కొన్నారు. తెలంగాణలో 10లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. వరద సహాయక చర్యల్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గానికి.. వందలమంది కార్యకర్తలతో రేవంత్‌రెడ్డి పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలోనే ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్ పనులను ఆయన పరిశీలించారు. సోమవారం లోపు ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలన్నారు. లేకపోతే పార్లమెంటులో సోమవారం నితిన్ గడ్కరీకి నివేదిస్తామని చెప్పారు. అక్కడినుంచి మల్కాజ్‌గిరికి చేరుకున్న రేవంత్‌రెడ్డి.. అక్కడి కాలనీల్లో పర్యటించారు.

వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా

"కేసీఆర్‌, కేటీఆర్‌కు ప్రజల ప్రాణాలంటే పూచిక పుల్లతో సమానం. వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా?. రాష్ట్రం వరదలతో అతలాకుతలం అయింది. ముందస్తు హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు. వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా రాజకీయాలపై దృష్టి పెట్టారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేటీఆర్ పార్టీల్లో మునిగిపోయారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ప్లడ్ రిలీఫ్ కమిటీ వేశామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మండల, జిల్లా స్థాయి నాయకులను అప్రమత్తం చేశామని పేర్కొంది. బాధితులకు ఆహార ఏర్పాట్లు చేస్తున్నామని వివరించింది. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపింది. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్లు 040-24602383, 040 - 24601254 లకు ఫోన్‌చేయాలని వెల్లడించింది.

ఇవీ చదవండి : Hussain Sagar Water Flood : నిండుకుండలా హుస్సేన్​ సాగర్.. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం

Moranchapalli Floods : భూపాలపల్లి మండలం మొరంచపల్లిలో సహాయక చర్యలు చేపట్టిన బీఆర్‌ఎస్‌ నాయకులు

Last Updated : Jul 29, 2023, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.