Revanthreddy criticizes Dharani Portal : ఓటరు జాబితా విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు. గాంధీ భవన్లో మాట్లాడిన రేవంత్.. ధరణి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు ఆర్థిక నేరగాళ్లని.. అందులో విదేశీయుల భాగస్వామ్యం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పోర్టల్‌లో ఉన్న వివరాలన్నీ విదేశీయుల చేతుల్లోకి వెళ్లాయని చెప్పారు.
Revanthreddy fires on CM KCR : ధరణి పోర్టల్ అనేక చేతులు మారి.. బ్రిటీష్ ఐల్యాండ్ చేతికి వెళ్లిందని రేవంత్‌రెడ్డి అన్నారు. త్వరలో ధరణి దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు. కోదండ రెడ్డి, సంపత్‌తో కలిసి భూమి డిక్లరేషన్‌ను రేవంత్ రెడ్డి విడుదల చేశారు. నిషేధిత జాబితాలోని భూములను ప్రభుత్వంలోని కొందరు పెద్దలు అనుచరులకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు అనుచరులకు రిజిస్ట్రేషన్ చేసి వెంటనే ప్రొహిబిషన్‌ను లాక్ చేస్తున్నారన్నారు. ధరణి పోర్టల్ మొత్తం కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ గాదె చేతిలో ఉందని వెల్లడించారు. జులై 15 తర్వాత ధరణిలో జరిగిన అక్రమాలను బయటపెడతానని రేవంత్ రెడ్డి తెలిపారు.
'ధరణి పోర్టల్ మొత్తం కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ గాదె చేతిలో ఉంది. దేవాదాయ భూములను అక్రమంగా ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని చూశారు. ధరణి పోర్టల్ రద్దు చేస్తానంటే కేసీఆర్ భయపడుతున్నారు. ధరణి విషయంలో కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ధరణిని రద్దు చేసి అంతకంటే మెరుగైన విధానం తీసుకువస్తాం. కేసీఆర్ పాల్పడిన భూఅక్రమాలను కూడా బయటపెడతాం. ధరణిలో జరిగిన అక్రమాలను జులై 15 తర్వాత వెల్లడిస్తా. కేంద్రం తలచుకుంటే ధరణి వెనుకున్న ఆర్థిక నేరాలను బయటపెట్టవచ్చు. ధరణిలో పెట్టుబడి పెట్టిన విదేశీ ఆర్థిక నేరగాళ్లను కేంద్రం అరెస్టు చేయాలి.'-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
కేసీఆర్ అంటే... కిషన్ చంద్రశేఖర్ రావు : కేసీఆర్‌కు లబ్ధి చేసేందుకే తెలంగాణలో బీజేపీ నాయకత్వం మారిందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంటే... కిషన్ చంద్రశేఖర్ రావు అని ప్రజలు అంటున్నారన్న రేవంత్... బీఆర్ఎస్-బీజేపీ దోస్తీ బలోపేతం అవుతోందని ఆరోపించారు. కేటీఆర్ సూచన మేరకే అమిత్ షా మార్పులు చేశారన్నారు. ఈటలకు భద్రత పెంచినా.. అనుమానితుడిపై కేసు పెట్టలేదన్న రేవంత్‌రెడ్డి... ఎవరి వల్ల ప్రమాదం ఉందో రాజేందర్ స్పష్టంగా చెప్పారని తెలిపారు. తన భద్రతపై కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. భద్రత కల్పించడం వల్ల ఈటల రాజేందర్ అయినా సంతోషంగా ఉంటారన్నారు.
ఇవీ చదవండి :
- Revanthreddy on Telangana Elections 2023 : 'డిసెంబర్ 9 నాటికి అధికారంలోకి.. విజయోత్సవ సభా ఇక్కడే'
- Revanth Comments on BRS : 'కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. చర్లపల్లిలో కేసీఆర్ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు'
- Revanthreddy Comments on CM KCR : 'రాజకీయ స్వార్థం కోసం.. అమరుల త్యాగాలను కేసీఆర్ వాడుకున్నారు'