ETV Bharat / state

'ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా వేయాలి' - vote for note case latest update

ఓటుకు నోటు కేసు విచారణను నెల రోజులపాటు వాయిదా వేయాలని కోరుతూ అనిశా న్యాయస్థాంలో ఎంపీ రేవంత్​ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఏప్రిల్ 8 వరకు విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

revanth request for Vote note case hearing should be adjourned
'ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా వేయాలి'
author img

By

Published : Mar 8, 2021, 6:44 PM IST

ఓటుకు నోటు కేసు విచారణ ప్రక్రియ నెల రోజులపాటు వాయిదా వేయాలని అనిశా న్యాయస్థానాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఏప్రిల్ 8 వరకు విచారణ వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన సాక్షిగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు హాజరయ్యారు.

అనిశా సమర్పించిన హార్డ్​డిస్క్, సీడీల్లో సమాచారం ల్యాప్​టాప్​లో తెరుచుకోవడం లేదని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో హార్డ్​డిస్క్​, సీడీల్లోని సమాచారాన్ని తాము అందిస్తామని అనిశా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. నెల రోజులపాటు వాయిదా వేయాలన్న రేవంత్ రెడ్డి పిటిషన్​పై కౌంటరు దాఖలు చేస్తామని తెలపడంతో విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: ఓటుకు నోటు కేసులో నిందితులపై అభియోగాలు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.