ETV Bharat / state

"కేసీఆర్​కు ​అమర జవాన్లపై ప్రేమ కంటే రాజ్యాధికార విస్తరణపైనే ఆకాంక్ష ఎక్కువ" - congress party latest news

Revanth Reddy fire on CM KCR: సీఎం కేసీఆర్​కు అమర జవాన్లపై ప్రేమ కంటే రాజకీయ, రాజ్యాధికార విస్తరణ ఆకాంక్షే ఎక్కువగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. అమర జవాన్లు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా వారిపై కాంగ్రెస్‌ పార్టీకి సానుభూతి ఉంటుందని చెప్పిన ఆయన రాష్ట్రానికి చెందిన అమర జవాన్​ యాదయ్య కుటంబం మీకు కనిపించలేదా అని కేసీఆర్​కు లేఖ రాశారు.

రేవంత్​రెడ్డి
రేవంత్​రెడ్డి
author img

By

Published : Sep 1, 2022, 7:38 PM IST

Revanth Reddy fire on CM KCR: తెలంగాణకు చెందిన అమర జవాన్ యాదయ్య కుటుంబానికి ప్రభుత్వం అన్యాయం చేయడంతో పాటు పరిహారం విషయంలో నిర్లక్ష్యం వహించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అమర జవాన్లు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా త్యాగంపట్ల వారి మరణం పట్ల కాంగ్రెస్‌ పార్టీకి సానుభూతి ఉందని... అయితే సీఎం కేసీఆర్‌ వ్యవహారశైలి పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఆయన సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

అమర జవానుల కుటుంబాల పట్ల సానుభూతి కంటే రాజకీయ, రాజ్యాధికార విస్తరణ ఆకాంక్షే అధికంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. అమర జవాన్ల మరణాలను సైతం సీఎం స్వార్థ రాజకీయాలకు వాడుకునే ఎత్తుగడ చూసి తెలంగాణ సమాజం విస్తుపోతోందని తెలిపారు. నిజంగా అమర జవాన్ల కుటుంబాల పట్ల మీకు సానుభూతి ఉంటే... తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమర జవాన్, దళిత బిడ్డ మల్లెపాకుల యాదయ్య కుటుంబం మీకు కనిపించలేదా... యాదయ్య త్యాగం మీకు యాదికి రాలేదా... అని ఆ లేఖలో సూటిగా ప్రశ్నించారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ యాదయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఆ కుటుంబానికి ఐదెకరాలు వ్యవసాయ భూమి, కల్వకుర్తిలో ఇంటి స్థలం, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.