ETV Bharat / state

Revanth Reddy Zoom Meeting With DCC Presidents : 'విజయభేరి బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చేలా చూడాలి' - Congress public meeting on 17th in Tukkuguda

Revanth Reddy Zoom Meeting With DCC Presidents : సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో తలపెట్టిన విజయభేరీ బహిరంగ సభపై రేవంత్‌రెడ్డి.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 35,000 బూత్‌ల నుంచి సభకు తరలివచ్చేలా చూడాలని డీసీసీలకు రేవంత్‌రెడ్డి సూచించారు.

Revanth Reddy
Telangana Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2023, 10:52 PM IST

Revanth Reddy Zoom Meeting With DCC Presidents : తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో.. ఈ నెల 11 నుంచి సమావేశాలు నిర్వహించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు డీసీసీ అధ్యక్షులతో.. రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌లు జూమ్‌ ( Revanth Reddy Zoom Meeting With DCC Presidents) ద్వారా సమావేశం నిర్వహించారు.

Tukkuguda Vijaya Bheri Sabha : ఈ నెల 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి బహిరంగ సభపై (Tukkuguda Vijaya Bheri Sabha) వారు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 35,000 బూత్‌ల నుంచి సభకు తరలివచ్చేలా చూడాలని రేవంత్‌రెడ్డి.. డీసీసీలకు సూచించారు. రేపు 17 పార్లమెంట్ అబ్జర్వర్లు, వైస్‌ప్రెసిడెంట్లతో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 12, 13, 14 మూడు రోజులు పార్లమెంట్ పరిధిలో వారు.. అన్ని నియోజకవర్గాల్లో సమీక్షలు చేస్తారని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Congress Party joinings in Telangana : కాంగ్రెస్​లో ప్రముఖ నాయకుల చేరికకు ముహూర్తం ఖరారు

Congress to Announced Five Guarantees in Telangana : ఈ నెల 17న విజయభేరీ సభలో సోనియాగాంధీ 5 గ్యారంటీలను విడుదల చేస్తారని రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ నెల 18న ఉదయం 11:00 గంటలకు 119 నియోజకవర్గాలకు జాతీయ నాయకులు చేరుకుంటారని.. అక్కడ డీసీసీలతో కలిసి 5 గ్యారంటీలకు సంబంధించి పోస్టర్లు అతికించాలని సూచించారు. ఇంటింటికి గ్యారంటీ కార్డులను అందేట్లు చూడాలని.. కార్యకర్తలతో కలిసి భోజనాలు చేయాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆ తర్వాత మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సోనియాగాంధీ ప్రకటించిన అయిదు గ్యారంటీలను ప్రజలకు వివరించాలని రేవంత్‌రెడ్డి సూచించారు. 18న ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు సమన్వయం చేసుకుని సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

అంతకుముందు పలువురు బీఆర్ఎస్ నాయకులు.. రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్‌పేట్, దౌల్తాబాద్ మండలాలకు చెందిన మాజీ సింగిల్ విండో డైరెక్టర్, పలువురు కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి.. హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. ఐదేళ్లు గడిచినా బీఆర్‌ఎస్ కొడంగల్‌కు చేసిందేమి లేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నారాయణపేట్‌ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు.

Revanth Reddy Fire on BJP : 'బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై కుట్ర చేస్తున్నాయి'

బొమ్రాస్‌పేట్, దౌల్తాబాద్‌లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కొండంగల్ నియోజకవర్గాన్ని ముక్కలు చేసి రెండు జిల్లాల్లో కలిపారని విమర్శించారు. ఇప్పటి వరకు ఆ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని.. అప్పుడే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. హరీశ్, కేటీఆర్, కేసీఆర్ కేవలం వారి ప్రాంతాలకే మంత్రులు, సీఎంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధిని కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కే పరిమితం చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ నెల 17న తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయభేరి మోగించబోతున్నామని.. అక్కడికి కొండంగల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

KC Venugopal on Telangana Assembly Elections 2023 : 'ఈసారి అధికారంలోకి రాబోతున్నాం.. సమన్వయంతో పని చేయండి'

Congress Left Parties Alliance Telangana : వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు చిక్కు.. సీట్ల విషయంలో తేలని లెక్క

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.