ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు రేవంత్​రెడ్డి బహిరంగ లేఖ.. అలా చేయాలంటూ డిమాండ్​

author img

By

Published : Dec 31, 2022, 9:35 PM IST

Revanth Reddy Letter to CM KCR : రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర రాక రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. సరైన వ్యవసాయ విధానం లేక రైతాంగం సంక్షోభంలో పడిందని అన్నారు. పత్తికి క్వింటాల్​కు రూ.15 వేలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు.

Revanth Reddy
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి

Revanth Reddy Letter to CM KCR : పత్తికి మద్దతు ధర కల్పించడంతో పాటు.. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ సీఎం కేసీఆర్​కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎండనక, వాననక కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించకుండా దళారులు రైతులను దగా చేస్తుంటే.. అండగా నిలవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని రేవంత్​రెడ్డి విమర్శించారు. పంట ఏదైనా వ్యాపారులు, దళారులు చెప్పిందే రేటు అన్నట్లుగా తయారయ్యిందని లేఖలో పేర్కొన్నారు.

పంటలకు కనీస మద్దరు ధర కావాలంటూ రైతులు రోడ్డెక్కితే.. ప్రభుత్వం నుంచి కనీసం స్పందనలేదని మండిపడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితుల మధ్య రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుంటే వారు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. సరైన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళికలు లేకపోవడం వల్లే.. రైతును సంక్షోభంలో పడేశాయని ధ్వజమెత్తారు.

రైతుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానం: ఈ ప్రభుత్వ విధానాల వల్లనే రాష్ట్రంలో సగటున రోజుకు ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఈ నివేదిక ప్రకారం 2014 నుంచి 2021 వరకు రాష్ట్రంలో 6557 మంది రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. ఈ ఏడాది నవంబర్​ వరకు 11 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 512 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలిందని లేఖలో పేర్కొన్నారు. 2014 నుంచి ఈ ఏడాది నవంబర్​ వరకు ఈ తొమ్మిదేళ్లలో 7069 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రేవంత్​ రెడ్డి అన్నారు.

కౌలు రైతులను ఆదుకోవాలి: రాష్ట్రంలో మొత్తం 16లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని.. ఈ రైతు ఆత్మహత్యల్లో ఎక్కువగా కౌలురైతులవే 80శాతం ఉంటున్నాయని ఆరోపించారు. ఈ రైతు ఆత్మహత్యల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం మార్గాన్ని అన్వేషించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్న​ ప్రధాన డిమాండ్లు:

  • పత్తికి క్వింటాకు రూ.15వేలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
  • రాష్ట్రప్రభుత్వం తక్షణం రైతులకు రూ.లక్ష రుణమాఫీని అమలు చేయాలి.
  • ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల వ్యక్తిగత అప్పులను వన్​ టైం సెటిల్మెంట్​ కింద ప్రభుత్వమే పరిష్కరించి చొరవ తీసుకోవాలి.
  • కౌలు రైతులను కూడా రైతులుగా గుర్తించి.. ప్రభుత్వం రైతులకు వర్తించే అన్ని పథకాలను అమలు చేయాలి.
  • పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.