ETV Bharat / state

REVANTH REDDY: పెద్దమ్మ తల్లి గుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో ప్రత్యేక​ పూజలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా గాంధీభవన్‌ బయల్దేరారు. భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో జూబ్లీహిల్స్ రోడ్లు కిక్కిరిసిపోయాయి.

author img

By

Published : Jul 7, 2021, 11:47 AM IST

Updated : Jul 7, 2021, 1:36 PM IST

revanth-reddy-visited-jubilee-hills-paddamma-thalli-temple
పెద్దమ్మ తల్లి గుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం కోసం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా బయలుదేరారు. ముందుగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి(peddamma thalli) గుడికి వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు తమ నేతను గజమాలతో సత్కరించారు. అనంతరం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో రహదారులు నిండిపోయాయి. ర్యాలీకి అడ్డంకులు లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

ర్యాలీ మధ్యలో నాంపల్లి యూసుఫైన్ దర్గాలో రేవంత్ ప్రార్థనలు చేయనున్నారు. తర్వాత గాంధీభవన్​కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నుంచి రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం గాంధీభవన్‌లో నిర్వహించబోయే సభలో ప్రసంగిస్తారు.

రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్యం ఠాగూర్ హాజరుకానున్నారు. అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు కూడా హాజరుకానున్నారు.

ఇదీ చూడండి:TPCC NEW CHIEF:నేడే రేవంత్​ చేతికి పగ్గాలు.. ముస్తాబైన గాంధీభవన్​

Last Updated : Jul 7, 2021, 1:36 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.