ETV Bharat / state

Revanth Reddy: 'మంత్రి కేటీఆర్​ ధన దాహంతో భాగ్యనగరం ధ్వంసం' - Revanth Reddy spoke illegal constructions

Revanth Reddy Angry On KTR: మంత్రి కేటీఆర్​ ధన దోపిడీని.. సీఎం కేసీఆర్​ ఎందుకు నిలువరించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్​ ధన దాహంతో విశ్వ నగరాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.

revanth reddy
revanth reddy
author img

By

Published : Apr 13, 2023, 7:33 PM IST

Updated : Apr 13, 2023, 10:58 PM IST

Revanth Reddy Angry On KTR: మంత్రి కేటీఆర్​.. రూ.వేల కోట్ల ధనదాహంతో హైదరాబాద్​ విశ్వ నగరాన్ని ధ్వంసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఆరోపించారు. కేబీఆర్​ పార్క్ పరిసర ప్రాంతాల్లో వాణిజ్య భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వని ప్రభుత్వం.. మంత్రి డెవలపర్స్​ సంస్థకు 15 అంతస్తుల భవనానికి ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు.​ గాంధీ భవన్​లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

కేబీఆర్​ పార్క్​ను ఎందరో ముఖ్యమంత్రులు కాపాడారని.. సినీ తారల నుంచి సామాన్యుల వరకు ఎందరో కేబీఆర్​ పార్క్​కు వెళుతూ ఉంటారని రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఫైవ్​ స్టార్​ హోటల్​ కోసం గతంలో టెండర్లను పిలిచారని.. 2006లో కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు అన్ని నిబంధనలు పాటించాలన్న షరతులతో అనుమతులు మంజూరు చేశారని స్పష్టం చేశారు. ఈ టెండర్​ను మూడు సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి దక్కించుకుని.. ఆ తర్వాత కాలంలో మంత్రి డెవలపర్స్​ సంస్థ దీనిలో చేరిందని తెలిపారు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ ప్రభుత్వం.. 2018లో మంత్రి డెవలపర్స్​ సంస్థకు ఏడు అంతస్తులు కట్టుకునేందుకు అన్ని అనుమతులు ఇచ్చిందని మండిపడ్డారు. మళ్లీ ఆ తర్వాత అదే సంస్థ.. 12 అంతస్తుల కోసం అనుమతులు కోరుతూ దరఖాస్తులు చేసుకుందన్నారు. 2022లో మరోసారి భూమి లోపల మూడు అంతస్తులు, భూమిపైన 12 అంతస్తులకు అనుమతులు కోరిందన్నారు. అప్పుడే ఆ సంస్థ​ జుట్టు మంత్రి కేటీఆర్ చేతికి చిక్కిందని అభిప్రాయపడ్డారు.

ఆర్​ఎన్​ఆర్​ డెవలపర్స్​ రాకతో మరిన్ని అంతస్తులకు అనుమతులు వచ్చాయని చెప్పారు. ఒక్కో ఫ్లాటు.. 8 వేల ఎస్​ఎఫ్​టీల వైశాల్యంలో నిర్మిస్తున్నాయని తెలిపారు. ఇక్కడ ఒక్కో ఫ్లాటు విలువ సుమారు రూ.21 కోట్లు పలుకుతుందని తెలిపారు. కేబీఆర్​ పార్కు​లో పువ్వును కోసినా శిక్షించేలా నిబంధనలు ఉన్నాయని.. మరి ఇలా అక్రమాలు చేస్తుంటే అలాంటి వారికి ఏ శిక్షలు వేయాలని మంత్రి కేటీఆర్​పై ధ్వజమెత్తారు.

కేబీఆర్​ పార్కును ఆనుకొని 15 అంతస్తుల్లో ఫ్లాట్లు నిర్మిస్తున్నారని రేవంత్​ రెడ్డి వివరించారు. అక్కడ ఆగర్భ శ్రీమంతులు మాత్రమే రూ.21 కోట్లు పెట్టి ఫ్లాట్​ కొనుక్కుంటారని వెల్లడించారు. ఒక్కో ఫ్లాట్​లో కనీసం ఐదు, ఆరు కార్ల వరకు ఉంటాయని.. అవి అన్నీ కలిపి వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉందన్నారు. జూబ్లీహిల్స్​ చెక్​పోస్టు వద్ద ఇప్పటికే విపరీతమైన ట్రాఫిక్​ సమస్య ఉందని తెలిపారు. జూబ్లీహిల్స్​ చౌరస్తాలో పట్టపగలే దోపిడీ జరుగుతోందని.. భవిష్యత్​లో హైదరాబాద్​ నివాసానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్​ దోపిడీని.. సీఎం కేసీఆర్​ ఎందుకు నిలువరించట్లేదని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 13, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.