ETV Bharat / state

'బీఆర్ఎస్ నాయకులకు అధికారులు కొమ్ము కాస్తున్నారు'

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2023, 5:56 PM IST

Updated : Nov 12, 2023, 7:31 PM IST

Revanth Reddy Sensational Comments on BRS : బీఆర్ఎస్ కుట్రలపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. తప్పుడు ప్రకటనలపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్‌రావుపై విచారణకు కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని గతంలో వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారన్న రేవంత్.. ఎస్సీ వర్గీకరణకు రాహుల్‌గాంధీ ఎప్పుడో మద్దతు తెలిపారని స్పష్టం చేశారు.

Revanth Reddy Sensational Comments
Revanth Reddy

Revanth Reddy Sensational Comments on BRS : కర్ణాటక నుంచి కిరాయికి మనుషులను రప్పించి ప్రదర్శనలు చేయిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. కర్ణాటకలో కరెంటు ఇవ్వట్లేదని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో తన నివాసంలో కాంగ్రెస్​ పార్టీపై వస్తున్న ఆరోపణలపై రేవంత్​ మాట్లాడారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గతంలో ఎన్నోసార్లు దాడులు చేశారని తెలిపారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి వరుస కుట్రలు జరుగుతున్నాయని రేవంత్​రెడ్డి ఆరోపించారు. డీకే శివకుమార్‌ పేరిట తప్పుడు లేఖ ప్రచారం చేశారని, ఫాక్స్‌కాన్‌ను బెంగళూరు తరలిస్తున్నట్లు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అన్న రేవంత్.. ప్రశాంత్‌కిషోర్​ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. ఏపీలో కోడికత్తి ఘటన, బంగాల్‌లో మమతా బెనర్జీ కాలి గాయం ఘటన ఇందుకు ఉదాహరణలుగా ఆయన పేర్కొన్నారు.

Revanth Reddy Comments on Guvvala Balaraju : కొత్త ప్రభాకర్‌రెడ్డి, గువ్వల బాలరాజుపై దాడి ఘటనలు కుట్రలో భాగమేనని రేవంత్​ ఆరోపించారు. గాయపడిన కొత్త ప్రభాకర్‌రెడ్డి నడుస్తుంటే పరామర్శకు వచ్చిన హరీశ్‌రావు(Harish Rao) పరిగెత్తారని ఎద్దేవా చేశారు. సంచలనం కోసమే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేశారని పోలీసులు చెప్పారన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని ఇప్పటి వరకు మీడియాకు చూపలేదని నిలదీశారు. దాడి ఘటన విచారణ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు నిందితుడు రాజు రిమాండ్‌ రిపోర్టు బయటపెట్టలేదని విమర్శించారు. నిందితుడు రాజు కాల్‌ రికార్డు బయటపెట్టలేదని మండిపడ్డారు.

Revanth Reddy Comments on BRS Leaders : మరో 3 కుట్రలు జరుగుతాయని ఇవాళ కేటీఆర్‌ స్పష్టంగా చెప్పారని రేవంత్ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ ప్రకటనపై ఎందుకు విచారణ చేపట్టడంలేదు? అని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌ ప్రకటన ఆధారంగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ ఘటనపైనా పేలుడు జరిగిందని మెుదట ప్రచారం చేశారని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో హంగ్‌ రావాలని బీజేపీ, జేడీఎస్‌ ప్రయత్నించాయన్న రేవంత్.. కుమారస్వామి ప్రెస్‌మీట్‌ను హరీశ్‌రావు ఎందుకు సమన్వయం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఇసుక మీద బ్యారేజీ కట్టడం వల్లే మేడిగడ్డ కుంగిపోయింది'

ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టింటుకోవట్లేదు : ఎన్నికల సంఘం మౌనంగా ఉంటుందన్న రేవంత్‌రెడ్డి.. ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని విమర్శించారు. వరుస కుట్రలపై ఎన్నికల అధికారులు విచారణ జరిపించాలని కోరారు. కేటీఆర్ జరగబోతాయని చెప్పిన మూడు కుట్రలపై నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. సానుభూతికోసం కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వరుస ఘటనల వెనుక ప్రశాంత్‌కిషోర్‌ ఉన్నారని తెలిపారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాలరాజుపై దాడి ఘటనల వెనుక కూడా ఆయనే ఉన్నారని ఫైర్ అయ్యారు. అధికారం నిలబెట్టుకునేందుకు కేసీఆర్ కుటుంబం ఎంతకైనా తెగిస్తుందని ధ్వజమెత్తారు.

'బీఆర్ఎస్ నాయకులకు అధికారులు కొమ్ము కాస్తున్నారు'

"అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఉన్న అక్రమ కేసులన్నీ రద్దు చేస్తాం. బీఆర్ఎస్ నాయకులకు అధికారులు కొమ్ము కాస్తున్నారు. తప్పు చేసే అధికారులు డిసెంబర్‌ 9 తర్వాత విచారణ ఎదుర్కోవాలి. అధికారుల తప్పులపై మా నేతలు రెడ్‌ డైరీలో రాస్తున్నారు. రెడ్‌ డైరీ ఆధారంగా అధికారులపై చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్‌ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు తొలగిస్తాం. 24 గంటలు కరెంటు ఇచ్చినట్లు లాగ్‌ బుక్కుల్లో ఉంటే నామినేషన్‌ ఉపసంహరించుకుంటాం. 24 గంటలు కరెంటు ఇవ్వనట్లు తేలితే కేసీఆర్ కుటుబం ముక్కు నేలకు రాస్తుందా." -రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : బీఆర్ఎస్ కుట్రలపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేవంత్​రెడ్డి అన్నారు. తప్పుడు ప్రకటనలపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్‌రావుపై విచారణకు కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని గతంలో వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని.. ఎస్సీ వర్గీకరణకు రాహుల్‌గాంధీ ఎప్పుడో మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే కాంగ్రెస్‌ భేషరతుగా మద్దతు ఇస్తుందని చెప్పారు. అధికార పార్టీకి కొమ్ముకాసే అధికారులు భవిష్యత్‌లో ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. కేసీఆర్‌కు సహకరించిన అధికారులపై విచారణ జరిపిస్తామన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు.

'ఈవీఎంలు మార్చి గత ఎన్నికల్లో ధర్మపురిలో బీఆర్‌ఎస్‌ గెలిచింది'

తెలంగాణ భవిష్యత్తును కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారు - ఇక్కడి తీర్పు కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది : రేవంత్​రెడ్డి

Last Updated : Nov 12, 2023, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.