Munugode By Election: మునుగోడులో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో మునుగోడులో.. ఉపఎన్నిక అనివార్యమైంది. అందులోనూ.. రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరటంతో.. రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్కు అడ్డాగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. కలవరం మొదలైంది. ఈ ఉపఎన్నికలో ఎలాగైనా సత్తా చాటాలని.. భాజపా, తెరాస పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. జెండా మారినా.. బ్రాండ్ వ్యాల్యూతో భాజపా నుంచి అభ్యర్థిగా రాజగోపాల్రెడ్డి మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అటు అధికార పార్టీ.. కూడా మునుగోడులో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు, సభలతో బలప్రదర్శన చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఆఆచితూచి అడుగులు వేస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా ఒడిసిపట్టుకుని ఉనికి చాటుకోవాలనుకుంటోన్న హస్తం పార్టీ.. అభ్యర్థి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అయితే.. ఈ విషయంలో సందిగ్ధం వీడకముందే.. ప్రచారానికి దిగుతోంది.
ముహుర్తం ఖారారు: ఉప ఎన్నికల ప్రచారానికి గురువారం నుంచి మొదలుకానుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. మండల ఇంఛార్జీలు మండలాల వారీగా పర్యటించి ప్రచారం నిర్వహిస్తారని, ఒకటో తేదీ నుంచి గడప, గడపకు కాంగ్రెస్ అన్న నినాదంతో ప్రచారం నిర్వహిస్తోందని వివరించారు. మూడో తేదీన మునుగోడులో తనతో పాటు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ మీడియాతో మాట్లాడతారని తెలిపారు. ప్రచారంలో కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని సూచించారు.
ఇవీ చదవండి: