ETV Bharat / state

Revanth Reddy Reacts on TDP Protest in Telangana : చంద్రబాబు అరెస్టుపై ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది: రేవంత్​రెడ్డి - చంద్రబాబు అరెస్ట్​పై రేవంత్​రెడ్డి

Revanth Reddy Reacts on TDP Protest in Telangana : చంద్రబాబు అరెస్టుపై రేవంత్​రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో నిరసన తెలపడంలో తప్పేముందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దేశ నాయకుడని రేవంత్​ గుర్తుచేశారు. ఏ పార్టీ వాళ్లైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.

Revanth Reddy Reacts on TDP Protest in Telangana
Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 8:46 PM IST

Revanth Reddy Reacts on TDP Protest in Telangana : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు(Chandrababu Naidu Arrest)పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు ఏపీకి మాత్రమే సంబంధించింది కాదని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు దేశ నాయకుడని ఆయన గుర్తుచేశారు. అరెస్టుపై తెలంగాణలో నిరసన తెలపడంలో తప్పేముందని వ్యాఖ్యానించారు. నిరసన తెలిపే వాళ్లు అంతా ఇక్కడి ఓటర్లేనని చెప్పారు. నిరసనకారులను నియంత్రించడంలో అర్థం లేదని రేవంత్​రెడ్డి అన్నారు. నిరసన తెలిపే హక్కును ఎవ్వరూ కాలరాయలేరని ఆరోపించారు. ఏ పార్టీ వాళ్లైనా నిరసన తెలిపే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు.

Telangana TDP Leaders Protest Against Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణలో హోరెత్తిన నిరసనలు

Revanth Reddy on Chandrababu Arrest : హైదరాబాద్‌ పదేళ్ల పాటు తెలుగురాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని రేవంత్​రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటే ఎలా..? అని ప్రశ్నించారు. నిరసనలు చేయవద్దన్న కేటీఆర్‌ వ్యాఖ్యలు అర్థరహితమని రేవంత్​ విమర్శించారు. హైదరాబాద్‌ ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది..? అని నిలదీశారు. ఉద్యమ సమయంలో అమెరికాలోనూ నిరసనలు జరిగాయని గుర్తుచేశారు. ఏం హక్కు ఉందని అమెరికాలో నిరసనలు చేశారని రేవంత్​ ప్రశ్నించారు. ప్రతి సమస్యకు దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ఏం హక్కు ఉందని దిల్లీలో బీఆర్ఎస్ నిరసనలు చేశారని నిలదీశారు. ఈ విధంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్​రెడ్డి విరుచుకుపడ్డారు.

KTR Reaction on TDP Protest in Telangana : ఆంధ్రాలో పంచాయితీ.. ఆంధ్రాలోనే తేల్చుకోవాలి: కేటీఆర్‌

Telangana Congress MLA Candidates List 2023 : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా(Congress MLA Candidates List) ఒకేసారి విడుదల చేయమని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థుల ప్రకటన విడతల వారీగా ఉంటుందని చెప్పారు. మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంతరావు రేపు కాంగ్రెస్‌లో చేరతారని తెలిపారు. అలాగే షర్మిల కాంగ్రెస్‌లో చేరిక విషయం తనకు తెలియదని మాట దాటవేశారు.

Telangana Congress Joinings 2023 : ఓవైపు అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తూనే కాంగ్రెస్‌(Telangana Congress).. మరోవైపు పార్టీలో నేతల చేరికల్లో జోరు పెంచింది. ఏఐసీసీ ఆదేశాలతో నేతల్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దిల్లీలో మూడు రోజుల పాటు జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం(Screening Committee Meeting)లో నియోజక వర్గాల వారీగా చర్చల్లో ఎక్కడ బలమైన నాయకులున్నారు? ఎక్కడ లేరు? అనే విషయాల్ని గుర్తించినట్లు తెలిస్తోంది. సొంత పార్టీ నేతలు బలంగా ఉన్న స్థానాల్లో బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)ల నుంచి తీసుకోరాదని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పలువురు నాయకులు వచ్చేందుకు చొరవ చూపినా.. సున్నితంగా తిరస్కరించారు. స్క్రీనింగ్‌ కమిటీలో చర్చించిన తర్వాత దాదాపు 15 నియోజకవర్గాలల్లో బీఆర్ఎస్(BRS Party)కు దీటుగా ఎదుర్కొనే నేతలు లేరని గుర్తించారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి బలమైన నాయకుల్ని చేర్చుకోవాలని నిర్ణయించారు.

Telangana Congress Joinings 2023 : కాంగ్రెస్​లో చేరికల జోరు.. రేపు హస్తం తీర్థం పుచ్చుకోనున్న మైనంపల్లి

BC MLA Ticket Issue in Congress Party : కాంగ్రెస్​లో బీసీ నేతల పోరుబాట.. 34 సీట్లు తమకే ప్రకటించాలని డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.