ETV Bharat / state

మునుగోడు అభ్యర్థి ప్రకటనపై రేవంత్‌రెడ్డి క్లారిటీ - కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఫైర్

లిక్కర్‌ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వచ్చాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ కుటుంబీకుల నివాసాల్లో ఈడీ ఎందుకు తనిఖీలు చేయట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నోసార్లు దిల్లీకి వెళ్లి కేజ్రీవాల్‌, ఆయన మంత్రులను కలిశారని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లల్లో ఈడీ, సీబీఐ ఇంకా ఎందుకు తనిఖీలు చేయట్లేదని మండిపడ్డారు.

Revanth Reddy
Revanth Reddy
author img

By

Published : Aug 24, 2022, 9:59 PM IST

Updated : Aug 24, 2022, 10:56 PM IST

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ రూ.వందల కోట్లు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న దర్యాప్తు సంస్థలదేనని తెలిపారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

దిల్లీలో లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ, ఈడీ సమగ్ర విచారణ జరపాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ఈ కుంభకోణంలో వివిధ వ్యక్తుల ఇళ్లను సోదాలు చేసిన ఈడీ.. కేసీఆర్‌ కుటుంబీకుల నివాసాల్లో ఇంకా తనిఖీలు ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. ఈడీ ఆలస్యం చేయటం వల్ల ఆధారాలు మాయం చేసే అవకాశం ఉందని తెలిపారు. కేసీఆర్‌, ఆయన కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోందని నిలదీశారు. వాసవి, సుమధుర, ఫీనిక్స్‌ గ్రూప్‌ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ వీటికి సంబంధించి ఐటీ అధికారులు అధికారికంగా ఎందుకు వెల్లడించడంలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు భాజపా ఐటీ, ఈడీ దాడులు చేయించి ప్రతిపక్షాలను లొంగదీసుకుంటోందని రేవంత్‌ ఆరోపించారు.

మునుగోడు అభ్యర్థి ప్రకటనపై రేవంత్‌రెడ్డి క్లారిటీ

ఈ నెలాఖరులోపు మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తాం. తెలంగాణపై ప్రియాంకగాంధీ ప్రత్యేక శ్రద్ద పెట్టారు. తెలంగాణకు అధిక సమయం ఇస్తానని ప్రియాంకగాంధీ చెప్పారు. -రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated : Aug 24, 2022, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.