Revanth Reddy on Congress MLA Candidates : తెలంగాణ కాంగ్రెస్ గెలుపు గుర్రాల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ కూడా ఎంపికలో మునిగిపోయింది. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం(Congress Hicommand) అభ్యర్థుల కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై వస్తున్న వార్తలపై స్పందిస్తు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దీనిపై మాట్లాడిన రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ పార్టీకి ఓ విధానం ఉందని.. దానిని అనుసరించే వారిని ఎంపిక చేస్తామని తెలిపారు.
Telangana Congress Bus Yatra 2023 : తిరగబడదాం- తరిమికొడదాం అనే నినాదంతో.. కాంగ్రెస్ బస్సు యాత్ర
Revanth Reddy Fires On Media On Fake News : మీడియా తమకిష్టమొచ్చినట్లు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి మమ్మల్ని గందరగోళానికి గురి చేయొద్దని అన్నారు. అభ్యర్థుల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని తెలిపారు. పార్టీలో టికెట్ల విషయంలో చిన్నపాటి అభిప్రాయాలు ఉండడం సహజమని.. అంత మాత్రాన మేము గొడవలు పడ్డామని, చొక్కాలు పట్టుకున్నామని రాయడం సరికాదని మండిపడ్డారు. అన్ని అంశాలు బేరీజు చేసుకున్నాకే అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.
"ఎన్నికల అంటే అధికారుల పాత్ర చాలా కీలకం. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు దిహగు బీఆర్ఎస్ పార్టీ నాయకులకంటే ఎక్కువ పార్టీ కోసం పని చేస్తున్నారు. వారి గురించి వివరాలను సేకరించి కేంద్ర, రాష్ట్రం ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తాం. వారి పార్టీ కోసం పని చేసే వారికోసం ఇక్కడ మోహరించారు. కొందరు అధికారులు ఎన్నికల నియమావళిని ఉల్లఘించి నిధుల కేటాయింపులు చేస్తున్నారు." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఛీఫ్
పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి: పొత్తులపై ఇంకా చర్చల దశలో ఉన్నాయన్న ఆయన.. కొందరు పొత్తు కుదుర్చుకున్నామంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్లపై మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. అభ్యర్థులను ఎంపిక చేశాక (Congress MLA Candidates)తామే అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఇలా అవకాశాలు చాలా ఉన్నాయని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారిని తప్పకుండా గుర్తించి గౌరవిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కొందరు అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కోసం పనిచేసే అధికారులను గుర్తించి వారి మీద ఫిర్యాదులు చేయబోతున్నామని తెలిపారు. అనేక హోదాల్లో రిటైరైన వారిని, బీఆర్ఎస్ కోసం పని చేసే వారిగా మోహరించుకున్నారని ఆరోపించారు. ఉన్నత హోదాలో ఉన్న కొందరు ఐఏఎస్‌లు బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని విమర్శించారు.
Revanth Reddy On Election Code Implementation : పింఛన్లు తప్ప ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి వచ్చాక ఓటర్లకు నిధులు విడుదల చేయకూడదని డిమాండ్ చేశారు. ఐఏఎస్‌ల నుంచి ఎమ్మార్వో వరకు కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న అధికారుల వివరాలు సేకరించడానికి ఒక కమిటీని నియమిస్తున్నామని తెలిపారు. ఎవరైనా కాంగ్రెస్‌పై తప్పుడు వార్తలు రాస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Congress MLA Candidates List : తెలంగాణ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్.. బలమైన అభ్యర్థుల కోసం వేట..