Revanth reddy on brs కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటి కెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఆదుకుందా? అని ప్రశ్నించారు. కాళోజీ కళాక్షేత్రం మెుండిగోడలతో అలాగే ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలో కేసీఆర్ పాలనతో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి... ప్రజలు గోస పడుతున్నారు. బాసిన బతుకు.. బతుకుతున్నాం. అందరం ఒక్కటై పోరాడుదాం. కార్యకర్తలకు నేను నాయకుడిని. వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటా. మీ మీద పెట్టిన కేసులను, మీరు కోల్పోయినవి అన్ని.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ కోరికలు నేరవేరుస్తా. ఇవ్వాళ కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. పదింతలు ఆదుకుంటా. మీరు ఒక్కటే చేయాల్సింది.. పోరాడుదాం.. కొత్త సంవత్సరం జనవరి 1, 2024 కల్లా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉంటుంది. వరంగల్ గడ్డ వేదికగా చెబుతున్నా - రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇక రెండు రోజుల విరామం తర్వాత.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 'హత్ సే హత్ జోడో యాత్ర' వరంగల్‌లో మళ్లీ ప్రారంభమైంది. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ కలెక్టరేట్ బంగ్లా వద్ద నుంచి యాత్ర ప్రారంభించారు. యాత్రకు ముందు కాజీపేట దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు రేవంత్ రెడ్డి. అమరవీరుల స్తూపం వద్ద రేవంత్ పోరాట యోధులకు నివాళులర్పించి.. ముందుకు సాగారు. ఏక శిలా పార్క్, హనుమకొండ బస్ స్టేషన్, పబ్లిక్ గార్డెన్, అంబేద్కర్ చౌరస్తా, పోలీస్ హెడ్ క్వార్టర్స్, హనుమకొండ చౌరస్తా మీదుగా అమృత జంక్షన్ వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. అనంతరం అమృత జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: