Revanth Reddy Letter to Harish rao: నిమ్స్‌లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు బహిరంగ లేఖ రాసిన ఆయన.. పది రోజులుగా స్టాఫ్ నర్సులు ఆందోళన చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 423 మంది స్టాఫ్‌నర్సులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదా అని నిలదీశారు.
ఆస్పత్రుల్లో నర్సులదీ కీలక పాత్ర అని తెలిసి కూడా నర్సుల ఆందోళనను నిమ్స్ యాజమాన్యం, ఆరోగ్యశాఖ మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా పని చేస్తూ సేవలు అందిస్తున్న నర్సుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'సీఎం కేసీఆర్ చొరవతో దశాబ్దాల భూసమస్యకు శాశ్వత పరిష్కారం'