Revanth Reddy Invite AICC Leaders to Take Oath : రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం దృష్ట్యా రేవంత్‌రెడ్డి హస్తిన(Delhi)లో వరుస భేటీలు జరుపుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలను వరుసగా ఆయన కలుస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానాలు పలుకుతున్నారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నేతలను రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కలిశారు.
అయితే మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి ప్రకటన వెలువడుతున్న సమయంలోనే హైదరాబాద్ నుంచి దిల్లీకి సీఎల్పీ నేత, కాబోయే సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. ఆరోజు ఉదయం నుంచి తీరిక లేకుండా వరుస పర్యటనలు జరిపారు. ముందుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన రేవంత్ రెడ్డి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని హైదరాబాద్ రావాల్సిందిగా ఆహ్వానించారు. అక్కడి నుంచి ఖర్గే నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మల్లికార్జున ఖర్గే మంత్రివర్గం ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
-
Congratulations to Telangana’s CM Designate, @revanth_anumula.
— Rahul Gandhi (@RahulGandhi) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Under his leadership, the Congress govt will fulfill all its Guarantees to the people of Telangana and build a Prajala Sarkar. pic.twitter.com/ExfUlqY8Ic
">Congratulations to Telangana’s CM Designate, @revanth_anumula.
— Rahul Gandhi (@RahulGandhi) December 6, 2023
Under his leadership, the Congress govt will fulfill all its Guarantees to the people of Telangana and build a Prajala Sarkar. pic.twitter.com/ExfUlqY8IcCongratulations to Telangana’s CM Designate, @revanth_anumula.
— Rahul Gandhi (@RahulGandhi) December 6, 2023
Under his leadership, the Congress govt will fulfill all its Guarantees to the people of Telangana and build a Prajala Sarkar. pic.twitter.com/ExfUlqY8Ic
ఆ లోక్‌సభ స్థానం నుంచి గెలిస్తే - మంత్రి పదవి పక్కా!
Revanth Reddy New Chief Minister in Telangana : ప్రజల తెలంగాణ కోసం నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ(AICC) అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఏఐసీసీ అధ్యక్షుడిని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. అక్కడి నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నివాసానికి వెళ్లిన కాబోయే ముఖ్యమంత్రి వారితో సమావేశమయ్యారు.
సీఎంగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌తో సుమారు 50 నిమిషాల పాటు సమావేశం జరిగింది. గురువారం హైదరాబాద్‌లో జరిగే ప్రమాణస్వీకారానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో వాగ్దానాలను నెరవేర్చుతామని రాహుల్‌గాంధీ ఈ సందర్భంగా తెలిపారని చెప్పారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం నిర్మాణం అవుతుందని అన్నారు.
-
Cordially met honourable Congress President Shri @kharge ji and congratulated on the victory in the Telangana state.
— Revanth Reddy (@revanth_anumula) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
I express my gratitude for trusting me with the responsibility of the state. pic.twitter.com/k8X3jhoK7n
">Cordially met honourable Congress President Shri @kharge ji and congratulated on the victory in the Telangana state.
— Revanth Reddy (@revanth_anumula) December 6, 2023
I express my gratitude for trusting me with the responsibility of the state. pic.twitter.com/k8X3jhoK7nCordially met honourable Congress President Shri @kharge ji and congratulated on the victory in the Telangana state.
— Revanth Reddy (@revanth_anumula) December 6, 2023
I express my gratitude for trusting me with the responsibility of the state. pic.twitter.com/k8X3jhoK7n
Revanth Reddy Invite Sonia Gandhi : అనంతరం పార్టీ నేతలతో కలిసి రేవంత్‌రెడ్డి సోనియాగాంధీ(Sonia Gandhi) నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి అగ్ర నాయకురాలిని ఆయన ఆహ్వానించారు. పార్లమెంటు సమావేశాలకు వెళ్తున్న సోనియాగాంధీని రేవంత్ ప్రమాణస్వీకారం గురించి మీడియా ప్రశ్నించగా తాను హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి తనను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణస్వీకారానికి అందరూ తప్పకుండా రావాలని దిల్లీలో రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు.
రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పు - మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం
రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం - సీఎం జగన్, చంద్రబాబుకు ఆహ్వానం