Revanth reddy hath se haath jodo yatra : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సర్వ సన్నద్ధం చేయడంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,. మేడారం సమ్మక్క సారలమ్మల సన్నిధి నుంచి ఇవాళ హాథ్ సే హాథ్ జోడో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి రేవంత్.. ముందుగా ములుగు జిల్లా గట్టమ్మ, సాయిబాబా ఆలయాల్లో పూజలు చేస్తారు. అక్కడి నుంచి మేడారానికి చేరుకుని వనదేవతలను దర్శించి.. దీవెనలు తీసుకుని మధ్యాహ్నం 12 గంటల నుంచి యాత్ర మొదలు పెడతారు.
hath se haath jodo yatra in telangana : కొత్తూరు, నార్లాపూర్ గోవిందరావుపేట ప్రాజెక్ట్ నగర్ అక్కడినుంచి పస్రా వరకూ వచ్చి అక్కడి కూడలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం.. గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్, వెంకటాపూర్ మండలం జవహర్ నగర్, ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్, ఇంచర్ల, వెంకటాపూర్ క్రాస్ మీదుగా పాలంపేట చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి...రేపు తిరిగి యాత్రను ప్రారంభిస్తారు. రెండు రోజుల పాటు.. ములుగు జిల్లాలోనే రేవంత్ రెడ్డి యాత్ర కొనసాగుతుంది.
రేవంత్ రెడ్డి యాత్ర ఇలా కొనసాగనుంది..
- ఉదయం 8 గంటలకు రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ హైవే మీదుగా ములుగు చేరుకుంటారు.
- అక్కడ గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు.
- మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
- ప్రాజెక్ట్ నగర్‌లో భోజన విరామం అనంతరం 2.30 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది.
- సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం తర్వాత పస్రా కూడలిలో సమావేశం నిర్వహిస్తారు.
- అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకుని రాత్రికి రేవంత్‌రెడ్డి అక్కడే బస చేస్తారు.
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, ఇతర ముఖ్య నాయకులు పాల్గొంటారు. నియోజకవర్గాల్లో సైతం....నేతలు...హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలను చేపడతారు. ఆరు నెలలపాటు పూర్తిగా జనంలోనే ఉండాలని ఉండాలని యోచించిన... రేవంత్ రెడ్డి.... అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికైతే మహబూబాబాద్ పార్లమెంటు నియోజక వర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పాదయాత్ర నిర్వహించేందుకు పార్టీ అధిష్ఠానం పచ్చజెండా ఊపింది.
ఆరు నెలలపాటు పూర్తిగా జనంలోనే రేవంత్ రెడ్డి : ఆరు నెలలపాటు పూర్తిగా జనంలోనే ఉండనున్న రేవంత్‌రెడ్డి.. అందుకు తగ్గట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికైతే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించేందుకు అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలల్లో హాథ్ సే హాథ్ జోడో యాత్రలు మొదలు అవుతాయని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.