Revanth Reddy Fires on CM KCR : కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) తొమ్మిదేళ్ల పాటు ఎదురుచూశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)పేర్కొన్నారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలను మోసగించినట్లే కేసీఆర్ సోనియా గాంధీని మోసం చేశారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్ర డీజీపీని తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ను ఉద్దేశించి హెచ్చరించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న వారిపై నిఘా పెట్టారని మండిపడ్డారు.
Revanth Reddy Comments on KTR : గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరిన తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ సునీత సంపత్, మాజీ డీసీసీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి ఇతర నేతలను రేవంత్ రెడ్డి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీసు కమిషనర్ కాంగ్రెస్ కార్యకర్తల ఫోన్‌లపై నిఘా పెట్టారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్(Minister KTR) కొంతమందిని బెదిరిస్తున్నారని తమకు తెలిసిందని మండిపడ్డారు.
Revanth Reddy Fires on CM KCR : 'కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది'
అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. కార్యకర్తలను కేసులతో ఇబ్బంది పెడితే ఊరుకోం. డీజీపీని తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సైబరాబాద్ కమిషనర్ కాంగ్రెస్ అనుచరులపై నిఘా పెట్టారు. కాంగ్రెస్ నాయకుల ఫోన్‌లపై నిఘా పెట్టారు. కాంగ్రెస్‌కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకోం. 45 రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే తెలంగాణలో అధికారం కాంగ్రెస్‌దే. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఖాయం.' -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Revanth Reddy on Congress 6 Guarantees : బీఆర్ఎస్ అధికారం మరో 45 రోజులేనని.. ఆ తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్తికి మిత్తితో చెల్లిస్తామని కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అరవింద్ కుమార్, జయేశ్ రంజన్, సోమేశ్ కుమార్ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారని.. అధికారులు అధికారుల్లా వ్యవహరించాలని బీఆర్‌ఎస్ కార్యకర్తల్లా కాదని హితవు పలికారు. మరో 45 రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం మనదేనని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయమని స్పష్టం చేశారు. ఎల్బీస్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయమన్నారు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు(Telangana Congress 6 Guarantees) అమలు చేస్తామని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మోదీ, కిషన్ రెడ్డి, రాజాసింగ్‌లా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
Revanth Reddy on Congress MLA Candidates : ఇష్టానుసారంగా వార్తలు రాస్తే చర్యలు తప్పవు: రేవంత్‌రెడ్డి