Revanth Reddy Fires on CM KCR : రానున్న రోజుల్లో కేసీఆర్ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల ద్వారా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంతోనే ఆ పార్టీ ఆరు గ్యారెంటీలు(Telangana Congress 6 Guarantees) ప్రకటించిందని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు.. కేసీఆర్ ఎక్కడ ఉన్నారని వెతకావాల్సిన పనిలేదు విమర్శించారు. తెలంగాణ ప్రజలను కల్వకుంట్ల కుటుంబం పట్టి పీడిస్తోందని ధ్వజమెత్తారు. సచివాలయ నిర్మాణంలో ఆ కుటుంబం దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.
Revanth Reddy Comments on KCR Family : ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక ముందు కేసీఆర్ ఫౌంహౌస్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. డిసెంబర్ నెలలో అద్భుతం ఆవిష్కరించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీరలేదని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ(Telangana Congress Party) నిర్ణయం తీసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో సంపద పెంచాలని.. అది పేదలకు పంచాలని సూచించారు. సరైన పద్ధతిలో సంపదను పేదలకు పంచడం కాంగ్రెస్ విధానమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
'కాంగ్రెస్ 6 గ్యారంటీలతో రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయి. తెలంగాణ ప్రజలను కల్వకుంట్ల కుటుంబం పట్టి పీడిస్తోంది. సచివాలయ నిర్మాణంలో కల్వకుంట్ల కుటుంబం దోపిడీకి పాల్పడింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ప్రకటించిన తర్వాత కేసీఆర్ ప్రజాక్షేత్రంలో లేరు. డిసెంబర్‌లో రాష్ట్ర ప్రజలకు విముక్తి లభిస్తుంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంతోనే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. తెలంగాణ ప్రజలు.. కేసీఆర్ ఎక్కడ ఉన్నారని వెతకావాల్సిన పనిలేదు. కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఫౌంహౌస్ నుంచి కేసీఆర్ బయటకు రావాల్సిన పనిలేదు.' -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Telangana Congress Bus Yatra Schedule 2023 : మరోవైపు రాష్ట్రంలో బస్సు యాత్ర చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. తాజాగా బస్సు యాత్ర షెడ్యూల్‌ను ఆ పార్టీ వర్గాలు విడుదల చేశాయి. ఈ యాత్రలో ఏఐసీసీ నేతలు ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నట్లు పేర్కొన్నాయి. ఈ బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Telangana Congress Bus Yatra 2023 : ఈ నెల 15వ తేదీ నుంచి బస్సు యాత్ర(Bus Yatra) ప్రారంభం అవుతుందని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. వారం.. పది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగునుందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. రోజుకి ఐదు నుంచి ఆరు నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు రూట్ మ్యాప్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధం చేస్తుంది. ఇందుకు సంబంధించి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో.. మంగళవారం రోజున రూట్ మ్యాప్‌తో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలంపూర్ నుంచి ఈ బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు సమాచారం.
Congress Election Campaign Telangana 2023 : బస్సు యాత్ర ప్రారంభం రోజున 15, 16వ తేదీల్లో ప్రియాంక గాంధీ(Priyanka Gandhi).. 18, 19వ తేదీలల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi), 20, 21వ తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బస్సు యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. దీని కోసం మూడు రకాల రూట్ మ్యాప్‌లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Congress MLA Candidates List : తెలంగాణ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్.. బలమైన అభ్యర్థుల కోసం వేట..