ETV Bharat / state

Revanth Reddy Fires on CM KCR : 'నన్ను తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నం.. బీఆర్​ఎస్​కు ఈసారి 25 సీట్లే' - Revanth Reddy fires on KCR

Revanth Reddy Fires on CM KCR : సమైక్యాంధ్రను సమర్థించిన ఏపీ సీఎం జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి.. సీఎం కేసీఆర్‌ విందు ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ద్రోహులతో అంటకాగింది కేసీఆర్‌ మాత్రమేనని ఆరోపించారు. చంద్రబాబుకు తాను సహచరుడిని మాత్రమేనని.. శిష్యుడిని కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు దిల్లీలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ద్రోహిగా తనను చిత్రీకరించేందుకు కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Revanth Reddy comments on Gaddar Death
Revanth Reddy fires on KCR
author img

By

Published : Aug 8, 2023, 8:06 PM IST

Revanth Reddy Fires on CM KCR : తెలంగాణ ద్రోహిగా తనను చిత్రీకరించేందుకు కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారని.. అసలైన ద్రోహులు వాళ్లేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శాసనసభ సమావేశాల్లో తండ్రీకుమారుడు తననే లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. దిల్లీలో మాట్లాడిన రేవంత్‌.. జూబ్లీహిల్స్‌ సొసైటీ డైరెక్టర్‌గా పని చేసినప్పటి నుంచి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడి వరకు ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పని చేయలేదన్నారు. చంద్రబాబుకు తాను సహచరుడిని మాత్రమేనని.. శిష్యుడిని కాదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను మహబూబ్‌నగర్‌లో ఎంపీగా గెలిపించింది తానేనని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో టీఆర్‌ఎస్‌ జెండా మోసేవాళ్లు కూడా పాలమూరులో ఎవరూ లేరని రేవంత్‌ అన్నారు. సమైక్యాంధ్రను సమర్థించిన జగన్‌ను ప్రగతిభవన్‌కు పిలిచి విందు ఇచ్చారని.. తెలంగాణ ద్రోహులతో అంటకాగింది కేసీఆర్‌ మాత్రమేనని ఆరోపించారు.

RevanthReddy on KCR: 'కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు'

Revanth Reddy Fires on KTR : పొన్నం, వివేక్ వెంకటస్వామి, జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులు అధిష్ఠానాన్ని వ్యతిరేకించి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లేనని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 25 సీట్లకు మించి రావని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఆ సందర్భంగా గద్దర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దర్ మృతి కోట్ల మందికి తీరని దుఃఖంగా రేవంత్‌ పేర్కొన్నారు.

Revanth Reddy comments on Gaddar Death : భవిష్యత్ తరాలకు గద్దర్ గొప్పతనం తెలియకుండా చిన్న చూపు చూసే ప్రయత్నం చేశారని విమర్శించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే నివాళి అర్పించేందుకు కేసీఆర్‌ వెళ్లలేదని గుర్తు చేశారు. గద్దర్ లాంటి యుద్ధనౌక చనిపోతే అసెంబ్లీలో సంతాపం తెలపకపోవడం దారుణమన్నారు. "లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ కలిసిపోయాయని.. వ్యూహాత్మకంగా నడుచుకో" అంటూ గద్దర్ తనకు సూచించారని పేర్కొన్నారు. గద్దర్ స్ఫూర్తితో తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

Harishrao fires on Revanthreddy : 'రేవంత్‌రెడ్డి... రాజకీయ ప్రస్థానం ఆర్​ఎస్​ఎస్​ నుంచే ప్రారంభమైంది'

"కేసీఆర్‌ కుటుంబం ఇప్పుడు అనుభవిస్తుంది అంతా కాంగ్రెస్‌ బిక్షే. కేసీఆర్‌ను కేంద్రంలో మంత్రిని చేసిందే కాంగ్రెస్. ఎమ్మెల్యేగా గెలవకపోయినా హరీశ్‌రావును మంత్రిని చేసింది కాంగ్రెస్. కేకే మహేందర్‌కు వెన్నుపోటు పొడిచి కేటీఆర్‌ను గెలిపించుకున్నారు. టీడీపీ కండువా కప్పుకుంటేనే సిరిసిల్లలో కేటీఆర్ మొదటిసారి గెలిచింది. టీడీపీ, కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణకు మోసం చేసింది కేసీఆర్‌. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిచేది 25 ఎమ్మెల్యే స్థానాలే. చంద్రబాబుకు నేను సహచరుడినే.. శిష్యుణ్ని కాదు. నేను ఏ స్థాయిలో ఉన్నా తెలంగాణ పక్షానే ఉన్నా. నేను పార్టీలు మారి ఉండొచ్చు.. తెలంగాణను వీడలేదు."- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

Revanth Reddy fires on KCR : 'చంద్రబాబుకి నేను సహచరుడినే.. శిష్యుణ్ని కాదు'

BRS Protests Against Congress : రైతులకు కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాల్సిందే.. ఎక్కడికక్కడ బీఆర్​ఎస్​ నిరసనలు

Congress CM Candidate MLA Seethakka : ' ఎమ్మెల్యే సీతక్క మా సీఎం'.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

Revanth Comments on BRS : 'కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. చర్లపల్లిలో కేసీఆర్‌ కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.