ETV Bharat / state

REVANTH REDDY: సీఎం కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేయాలి - pcc president latest news

కృష్ణా జలాల హక్కుల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆ దీక్షకు కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఒప్పించి మద్దతు ఇస్తామని ప్రకటించారు.

revanth-reddy-fires-on-cm-kcr-for-krishna-water-rights
సీఎం కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేయాలి: రేవంత్‌రెడ్డి
author img

By

Published : Jul 5, 2021, 7:06 AM IST

సీఎం కేసీఆర్‌ సమస్యను వివాదాస్పదం చేసి, విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన నీళ్లను అడ్డం పెట్టుకుని తెలంగాణ, రాయలసీమ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్‌ గెస్ట్‌హౌస్‌కు పరిమితం కాక తప్పదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మారిన వారికి చెప్పుల దండలు వేసి ఉరికించి కొడతామని వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణ సాధించేందుకు సరికొత్త యుద్ధానికి యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయాన్ని రేవంత్‌ సందర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, గడ్డం వినోద్‌, ఎంఏఖాన్‌, ఎం.కోదండరెడ్డి, పి.విష్ణువర్దన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌లను కలిశారు. ఆ సందర్భాల్లోనూ.. తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఆయన మాట్లాడారు.

ఈనెల 9వ తేదీన కేఆర్‌ఎంబీ (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) సమావేశ తేదీని నిర్ణయిస్తే దీన్ని 20వ తేదీకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరుతోందని రేవంత్‌ ప్రశ్నించారు. సీఎం బిజీగా ఉంటే ప్రతినిధిగా మాజీ నీటిపారుదలశాఖ మంత్రులు కడియం శ్రీహరి లేదా తుమ్మల నాగేశ్వరరావుని పంపవచ్చు కదా? అని అన్నారు. ఆరోజు సమావేశం ముందు తెలంగాణ ప్రజల హక్కులపై వాదించకుంటే సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్‌ను కుటుంబ పెద్దగానే ఏపీ సీఎం జగన్‌ చూడాలని అన్నారు. ఇక్కడ షర్మిల పార్టీ పెట్టడానికి, కేసీఆర్‌ జలాల అంశంపై రెచ్చగొట్టడానికి, తెలంగాణపై జగన్‌ ఫిర్యాదు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని రేవంత్‌ ఆరోపించారు.

పార్టీ ఫిరాయింపు నీతిమాలిన చర్య

తెలంగాణలో ఉద్యమ ద్రోహులే రాష్ట్రాన్ని ఏలుతున్నారని ఎంపీ ఎ.రేవంత్‌ ఆరోపించారు. ఎర్రబెల్లి, తలసాని, గంగుల, సబితా, పోచారం తదితరులే పాలిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇస్తే, ఇప్పుడు పార్టీ మారి కాంగ్రెస్‌లో ఏముందంటున్నారని దానం నాగేందర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘మేం రాళ్లతో కొడతాం.. అంటే ఎవరో చెప్పులతో కొడతామన్నారు.. అలాంటి వారినందరినీ 7వ తేదీ తర్వాత చెప్పుల దండలు వేసి మరీ ఉరికించి కొడతాం’’ అని రేవంత్‌ హెచ్చరించారు.

నాడు సంతకం చేశారు

కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్రం వాటా 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఏపీకి, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించగా కేంద్రం వద్ద నాటి నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌ ఒప్పందంపై సంతకాలు చేశారని రేవంత్‌ అన్నారు. నాడు 66: 34 నిష్పత్తి మేరకు 34 శాతం వాటా సరిపోతుందని సంతకం పెట్టి వచ్చారరన్నారు. ఏడేళ్లలో గోదావరి ప్రాజెక్టులపై రూ.90 వేల కోట్ల వ్యయం చేసిన ప్రభుత్వం.. కృష్ణా ప్రాజెక్టులపై కేవలం రూ.30 వేల కోట్లే ఖర్చు పెట్టిందని.. ఇందుకు కారణమేమిటని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడుకు జీవో 203 మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు మరణ శాసనంగా మారుతుందని నాగం జనార్దన్‌రెడ్డి సీఎంకు లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. నగరి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్‌ రాయలసీమను రతనాల సీమ చేస్తాం, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని చెప్పలేదా? అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: Revanth Reddy: పెద్దల సలహాలు, సూచనలతో ముందుకెళ్తా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.