Revanth Reddy Fires on BRS and BJP : కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకొని.. సరిపోదని దిల్లీలో లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC President Revanth Reddy) ఆరోపించారు. ఆ అవినీతిలో బీజేపీ ప్రొటెక్షన్ మనీ పొందుతోందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లో కలిసి నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. కవితను అరెస్ట్ చేసి రెండు నెలలు జైల్లో పెట్టి సానుభూతి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు.. కుమార్తెను జైలుకు పంపేందుకు సిద్ధమైన వారికి కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత లేదన్నారు.
Congress Vijayabheri Sabha in Tukkuguda Today : ఈ క్రమంలోనే కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న రేవంత్.. రైతులు పంటలు నష్టపోయి భూములు ఇస్తే, కేవలం 10 వేల మంది మాత్రమే హాజరు కావాలని పోలీసులు షరతులు పెట్టారని పేర్కొన్నారు. కొంత మంది పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏం చేయలేక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని 31 పంపుల్లో ఒక పంపు ప్రారంభించారని విమర్శించారు. కొండను తవ్వి ఎలుకను పడతారనుకుంటే.. కనీసం తొండను కూడా పట్టలేదని ఎద్దేవా చేశారు. సంపులో నుంచి నీటిని ఎత్తిపోసినట్లుందన్నారు.
Revanth Reddy Fires on KCR : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru Ranga Reddy Lift Irrigation Project)పై చేసిన వ్యయం కంటే శుక్ర, శనివారం ఇచ్చిన ప్రకటనలకే ఖర్చు ఎక్కువని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టుపై కేసులు వేసింది కేసీఆర్ పక్కనున్న హర్షవర్ధన్ రెడ్డి అని.. కేసీఆర్ అనుచరుడైన కిషన్ రెడ్డి గురించి మాట్లాడితే పట్టించుకోబోమని అన్నారు. కిషన్ రెడ్డిని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు(BJP State President Kishan Reddy) ఎందుకు చేశారో తెలుసా? అని ప్రశ్నించారు.
CWC Meeting Started at Hyderabad : హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశాలు
'కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతులు పంటలు నష్టపోయి భూములు ఇస్తే కేవలం పది వేల మంది మాత్రమే హాజరు కావాలని పోలీసులు షరతులు పెట్టారు. కొంతమంది పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చేసిన వ్యయం కంటే నిన్న మొన్న ఇచ్చిన ప్రకటనలకే ఖర్చు ఎక్కువ.' -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వంపై ఇవాళ్టి వరకు ఈడీ, సీబీఐ కేసులు కాదు కదా.. ఈగ కూడా వాలలేదని రేవంత్ పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా, నడ్డా విమర్శలు చేస్తారు కానీ, ఒక కేసు కూడా పెట్టలేదని మండిపడ్డారు. కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడా అని నిలదీశారు. తొమ్మిదేళ్లుగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) ఒక్కరోజైనా మహిళా రిజర్వేషన్ల బిల్లుపై మాట్లాడారా అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు(Women's Reservation Bill) కోసం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఆమరణ నిరహార దీక్ష చేస్తే మేం సంఘీభావం ప్రకటిస్తామని వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ అన్నారు.
Bhatti Vikramarka Fires on BJP and BRS : చారిత్రాత్మక నిర్ణయాలను దేశ భవిష్యత్ కోసం సీడబ్ల్యూసీ ప్రకటిస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader Bhatti Vikramarka) అన్నారు. ప్రజల జీవితాలను సమూలంగా మార్చే గ్యారంటీలను ప్రకటిస్తామని తెలిపారు. గ్యారంటీలను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని మండిపడ్డారు. ఇద్దరూ ఒక్కటే అని తెలంగాణ సహా దేశంలో అందరికీ తెలుసని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని ఎద్దేవా చేశారు. దీనిపై మైనార్టీ సోదరులు, సెక్యులర్ వాదులు ఆలోచించాలని కోరారు.
'బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. ఇద్దరూ ఒక్కటే అని తెలంగాణ సహా దేశంలో అందరికీ తెలుసు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే. మైనార్టీ సోదరులు, సెక్యులర్ వాదులు ఆలోచించాలి.' -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
Congress Vijayabheri Sabha Today : తుక్కుగూడ వేదికగా.. నేడు కాంగ్రెస్ ఎన్నికల సమర శంఖం