ETV Bharat / state

సోనియాగాంధీపై దాడి అంటే.. తెలంగాణ తల్లిపై దాడి: రేవంత్‌రెడ్డి - Revanth reddy vs bjp

ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలవడం దారుణమని పేర్కొన్నారు.

Revanth reddy
సోనియాగాంధీపై దాడి అంటే.. తెలంగాణ తల్లిపై దాడి: రేవంత్‌రెడ్డి
author img

By

Published : Jul 21, 2022, 4:55 PM IST

కేంద్ర వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే ఈడీ దాడులని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్లదుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు.

సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలవడం దారుణమన్న రేవంత్‌... సోనియాను ఈడీ విచారించడం మన తల్లిని అవమానించినట్లేనని తెలిపారు. సోనియాను అవమానిస్తుంటే మనం ఇంట్లో కూర్చుందామా? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో కేంద్రం తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదని స్పష్టం చేశారు. మహిళలను గౌరవించే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. మహిళలను అగౌరపరిచే దేశం నాశనమైపోతుందని అభిప్రాయపడ్డారు.

కేంద్రం వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే ఈడీ దాడులు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాకు ప్రజలు అండగా నిలబడాలి. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టిన సోనియా తెలంగాణ ఇచ్చారు. ఇది రాజకీయ పోరాటం కాదు.. ఆత్మగౌరవ పోరాటం. సోనియాగాంధీపై దాడి అంటే.. తెలంగాణ తల్లిపై దాడి చేసినట్లే.. తెలంగాణ ప్రజలందరూ సోనియాగాంధీకి అండగా నిలబడాలి. - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

భాజపా తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు చేస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సోనియా, రాహుల్‌పై తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. సంబంధం లేని కేసులో గాంధీ కుటుంబాన్ని వేధిస్తున్నారని విమర్శించారు. ఈడీ, సీబీఐ, కోర్టులపై ఒత్తిడి చేసి విపక్షపార్టీల అంతానికి కుట్ర అని వెల్లడించారు. భారత్ జోడోయాత్రకు భయపడి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈడీ విచారణ చేసినంత మాత్రాన కాంగ్రెస్ భయపడదని తేల్చిచెప్పారు.భారత్ జోడోయాత్రపై వెనక్కి తగ్గేదిలేదని వివరించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.