Revanth Reddy Election Campaign in Hyderabad 2023 : జంటనగరాల్లో భూములు ఆక్రమించి, అమ్ముకున్న వాళ్లను ఓడించాలని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పదేళ్లుగా డబుల్ బెడ్రూం ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్.. మరోసారి మోసపూరిత హామీలు ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్... వచ్చే నెల నుంచి కరెంట్ బిల్లు కట్టవద్దని సూచించారు.
Revanth Reddy Slams BRS Party : పదేళ్లు గడిచినా పేదలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేదని... పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆలుగడ్డలు అమ్మినట్లు సనత్‌నగర్ ఎమ్మెల్యే.. పేదల బతుకులను అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లో ఎన్నికల సభలో పాల్గొన్న రేవంత్... బీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కారు పేదల ప్రభుత్వం కాదని.. పెద్దల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.. హైదరాబాద్‌లో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రకటించినందు వల్లే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు వేలకోట్లు సంపాదించారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
'పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతే అధికం'
"పేదల కోసం పని చేసే పార్టీ ఏదో ప్రజలు ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. ఈ నగరాన్ని అమ్ముకొని, ఆక్రమించుకొని అన్యాయంగా పేద ప్రజల సొమ్మును కొల్లగొట్టి బతుకున్నదెవరో మీరు ఆలోచించాలి. నమ్మిన ప్రజలను మోసం చేసిన శ్రీనివాస్ యాదవ్‌కు గుణపాఠం చెప్పాలి. ఇవాళ అందరికి ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ చెబుతున్నారు.. నేను ప్రజలకు ఒకటే చెబుతున్నా.. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంటే నమ్ముతారా ." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఛీఫ్
ఆచితూచి అడుగేస్తున్న విపక్షాలు - ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి
తాను టికెట్లు అమ్ముకుంటున్నట్లు మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఖండించారు. సికింద్రాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కోకాపేట భూములు అమ్ముకున్నది ఎవరని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సామాన్యులు స్వేచ్ఛగా బతికేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. జెండామోసిన వారికి పార్టీలో గుర్తింపు ఉందనేందుకు.. ఆదం సంతోష్ ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.
24 గంటల కరెంట్ ముసుగులో వేల కోట్ల దోపిడీ చేశారు : రేవంత్ రెడ్డి
ముషీరాబాద్‌లో అంజన్‌కుమార్ యాదవ్, నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్, కంటోన్మెంట్‌లో తనగళంతో ప్రజలను చైతన్యం నింపిన గద్దరన్న కుమార్తెకు టికెట్ ఇచ్చినట్లు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఊర్లళ్లో భూములు ఉన్నవారికి ఉచితంగా కరెంటు ఇచ్చారు. కానీ బస్తీల్లో ఉండే పేద ప్రజలు సంపాదించిన రెక్కల కష్టమంతా కరెంటు బిల్లులకే పోతుందని మండిపడ్డారు. ఆ బిల్లుల నుంచి విముక్తి కలిగేందుకు వచ్చేనెల నుంచి కరెంట్ బిల్లులు కట్టవద్దని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల బిల్లు ఖర్చును తామే భరిస్తామని హామీ ఇచ్చారు. జంట నగరాల్లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంతో.. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.
ఎర్రబెల్లి వల్లే నేను జైలుకు పోవాల్సి వచ్చింది: రేవంత్ రెడ్డి
రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ - ఇంకా తెగని కాంగ్రెస్ అభ్యర్థుల పంచాయితీ