దేశంలో లోక్‌సభ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్యనే జరుగుతున్నాయని మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భాజపా లేదు కానీ... కారు గుర్తు ఓట్లు తీసుకుని దిల్లీకి పోయాక అవి కమలం గుర్తవుతాయని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక దేశంలో మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఒక మాట... ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడే నైజం కేసీఆర్‌దని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మోదీ జీరో... రాహుల్ గాంధీ హీరో: విజయశాంతి