Revanth Reddy Counter Tweet to KTR Tweet : కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయమని.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ హస్తం పార్టీ అని కేటీఆర్ ట్వీట్లో ఆరోపించారు. ఆయన ట్వీట్‌కు రేవంత్‌రెడ్డి కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. నిస్సిగ్గు మాటలకు కేరాఫ్ అడ్రస్ కేటీఆర్ అని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అంట కాగింది బీజేపీ, బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కుకు పాతరేసింది మీరేనని ఆయన ఆక్షేపించారు.
Revanth Reddy Tweet Today : కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రేవంత్‌రెడ్డి విమర్శించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయించలేని అసమర్థులని.. తెలంగాణకు అసమర్థుల పాలన ఇక అవసరం లేదని ఆయన ట్వీట్ చేశారు.
-
నిస్సిగ్గు మాటలు
— Revanth Reddy (@revanth_anumula) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
ఎదురుదాడులు
కేరాఫ్ అడ్రస్ డ్రామారావు
10 ఏళ్లు అధికారంలో ఉండి
అంట కాగింది మోడీ - కేడీ
కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ - కేడీ.
కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది మోడీ - కేడీ
విభజన చట్టంలోని… https://t.co/ZQcrYKSXWy
">నిస్సిగ్గు మాటలు
— Revanth Reddy (@revanth_anumula) October 19, 2023
ఎదురుదాడులు
కేరాఫ్ అడ్రస్ డ్రామారావు
10 ఏళ్లు అధికారంలో ఉండి
అంట కాగింది మోడీ - కేడీ
కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ - కేడీ.
కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది మోడీ - కేడీ
విభజన చట్టంలోని… https://t.co/ZQcrYKSXWyనిస్సిగ్గు మాటలు
— Revanth Reddy (@revanth_anumula) October 19, 2023
ఎదురుదాడులు
కేరాఫ్ అడ్రస్ డ్రామారావు
10 ఏళ్లు అధికారంలో ఉండి
అంట కాగింది మోడీ - కేడీ
కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ - కేడీ.
కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది మోడీ - కేడీ
విభజన చట్టంలోని… https://t.co/ZQcrYKSXWy
అసలేం జరిగిదంటే : తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఆయన.. ముక్కు నేలకు రాసినా రాష్ట్ర ప్రజలు హస్తం పార్టీని నమ్మరని తెలిపారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.. చీకటి పాలనకు చిరునామా కర్ణాటకని దుయ్యబట్టారు. గత పదేళ్ల కాలంలో ట్రైబల్ యూనివర్సిటీపై రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపలేదని కేటీఆర్ ప్రశ్నించారు.
Priyanka Gandhi Fires on BRS and BJP : 'బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్ మోదీ చేతిలో ఉంది'
Minister KTR Tweet Today : బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై.. రాహుల్ గాంధీ ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదని కేటీఆర్ ప్రశ్నించారు . విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌కు.. రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని విమర్శించారు. కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వంద రోజుల్లోనే బొందపెట్టిన హస్తం పార్టీ అని మండిపడ్డారు. కానీ తెలంగాణలో మేనిఫెస్టోలో ఇవ్వని హామీలనూ నెరవేర్చిన ప్రభుత్వం తమదని కేటీఆర్ అన్నారు.
Revanth Reddy Meets Singareni Workers : 'సింగరేణి ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి'
KTR Tweet on Congress : నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి.. తెలంగాణలో నాటకాలకు తెర తీస్తే నమ్మేవారు ఎవరూ లేరని కేటీఆర్ పేర్కొన్నారు. కరప్షన్‌కు కేరాఫ్ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. కర్ణాటకలో కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను నిత్యం వేధింపులకు గురి చేసి.. ఇక్కడికొచ్చి నీతి వాక్యాలు చెబుతున్నారా అంటూ నిలదీశారు. పోడు భూముల సమస్యను దశాబ్దాలుగా కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరైతే.. ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవి బిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం తమదని కేటీఆర్ గుర్తుచేశారు.
శ్రీకాంతాచారిని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి.. ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే.. వందల మంది బలిదానాలకు కారణమైందని మండిపడ్డారు. నిన్న అయినా.. నేడు అయినా.. రేపు అయినా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ హస్తం పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని కేటీఆర్ ఎక్స్ ట్విటర్లో ఎద్దేవాచేశారు.