Revanth Comments On Governor Tamilisai: ప్రజా సమస్యలపై దృష్టి మరల్చేందుకు తెరాస-భాజపాలు కలిసి బిల్లుల ఆమోదంపై రాజకీయాలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. గవర్నర్ కూడా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సరికాదని తెలిపారు. రాష్ట్రంలో భాజపా బాధ్యతలు గవర్నర్ నిర్వహించాలనుకుంటే కష్టమని చెప్పారు. బండి సంజయ్, కిషన్రెడ్డి పాత్ర గవర్నర్ తమిళిసై పోషించాలనుకోవడం అనేది సమజసం కాదని హితవు పలికారు.
అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన నిర్వహించడానికి అవసరమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని.. సంస్థలను గౌరవించాలని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అనుమానాలను నివృత్తి చేసుకొని బిల్లులను ఆమోదింపజేసుకొని.. ప్రజలకు పరిపాలన అందించాలని సూచించారు. కానీ వీరిద్దరి వ్యవహారం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఫలితంగా గవర్నర్ వచ్చిన నష్టం లేదు.. కేసీఆర్కు వచ్చిన కష్టం లేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు భాజపా, తెరాస మానుకోవాలని రేవంత్రెడ్డి హితవు పలికారు
"గవర్నర్ తమిళిసై ప్రతి విషయాన్ని పారదర్శకంగా చూడాలి. రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో భాజపా నాయకులు సన్యాసులని నిన్న, మొన్న వీడియోలలో వచ్చింది. వారి బాధ్యతలు గవర్నర్ నిర్వహించాలనుకుంటే కష్టం. బండి సంజయ్, కిషన్రెడ్డి పాత్ర గవర్నర్ తమిళిసై పోషించాలనుకోవడం అనేది సమజసం కాదు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన నిర్వహించడానికి అవసరమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని, సంస్థలను గౌరవించాలి. అనుమానాలను నివృత్తి చేసుకొని ఆ బిల్లులను అమోదింపజేసుకొని ప్రజలకు పరిపాలన అందించాలి. గవర్నర్కు వచ్చిన నష్టం లేదు. కేసీఆర్కు వచ్చిన కష్టం లేదు. చిల్లర రాజకీయాలు భాజపా, తెరాస మానుకోవాలి." -రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: నా ఫోన్ ట్యాప్ అవుతుందనే అనుమానం ఉంది.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది: గవర్నర్
నేను ఎలాంటి బిల్లులను ఆపలేదు: గవర్నర్ తమిళిసై
పరుగు పందెం గెలిచి.. వైకల్యాన్ని ఓడించిన విద్యార్థి.. వీడియో వైరల్