Revanth Reddy Challenged 24 Hours Electricity In Telangana : రాష్ట్రంలో సాగుకు 24 గంటల విద్యుత్ ఏ ప్రాంతంలో ఇవ్వట్లేదని.. ఈ విషయంపై ఎక్కడైనా నిరూపించేందుకు తాను సిద్ధమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ చెప్పిన చోటు.. సిరిసిల్ల, సిద్దిపేట, చింతమడక ఎక్కడికైనా వచ్చి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సాగుకు 24 గంటల విద్యుత్ ఇవ్వట్లేదని.. కేవలం సింగిల్ ఫేజ్ విద్యుత్ మాత్రమే ఇస్తున్నామని ట్రాన్స్ కో సీఎండీనే స్వయంగా చెప్పారని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకు త్రీ ఫేజ్ కరెంట్‌పై నియంత్రణ పాటిస్తున్నామని.. అందుకే 8 నుంచి 10 గంటలే కరెంటు ఇస్తున్నట్లు అధికారులే చెప్పారని ఆయన వివరించారు. వ్యవసాయానికి సింగిల్ ఫేజ్ మోటార్లు ఎవరూ వాడరని.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్రాన్స్ కో లాగ్ బుక్స్ ప్రకారమే నిరూపించారని అన్నారు.
ఎక్కువ గంటలు చూపిస్తూ కేసీఆర్ కుటుంబం దోపిడీ : విద్యుత్ కొనుగోలు కోసం ఏటా రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపిస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కానీ ఆ రూ.16 వేల కోట్లలో రూ.8 వేల కోట్లను బీఆర్ఎస్ నేతలే దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎక్కువ గంటలు చూపిస్తూ కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని మాత్రమే తాను చెప్పానని.. వారం రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. సాగుకు 24 గంటలు విద్యుత్ ఇవ్వట్లేదని ఎక్కడైనా నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.
"సాగుకు 24 గంటల విద్యుత్ ఇవ్వట్లేదని.. కేవలం సింగిల్ ఫేజ్ విద్యుత్ మాత్రమే ఇస్తున్నామని ట్రాన్స్ కో సీఎండీనే స్వయంగా చెప్పారు. రైతులకు త్రీ ఫేజ్ కరెంట్‌పై నియంత్రణ పాటిస్తున్నామని అధికారులే తెలిపారు. త్రీ ఫేజ్ విద్యుత్‌ను 8 నుంచి 10 గంటలే ఇస్తున్నట్లు అధికారులే చెప్పారు. విద్యుత్ కొనుగోలు కోసం ఏటా రూ.16 వేల కోట్ల ఖర్చు చేస్తున్నట్లు చూపిస్తున్నారు. కానీ ఆ రూ.16 వేల కోట్లలో రూ.8 వేల కోట్లను బీఆర్ఎస్ నేతలే దోచుకుంటున్నారు." -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Revanth Reddy Challenged To KTR : కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ అమ్ముతానంటే కేసీఆర్ సర్కారు కొనుగోలు చేయడం లేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 2014 నుంచి దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ సామర్థ్యం పెరిగిందన్నారు. చాలా రాష్ట్రాల్లో అవసరానికి మించిన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్ చేపట్టిన చర్యల వల్ల దేశమంతా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని హర్షించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లలోనూ కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సమృద్ధిగా ఉందని.. మరి అన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ ఉన్నారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే "రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్‌ను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవాలి. 24 గంటల విద్యుత్ ఇచ్చేంత వరకు రైతు వేదికలకు తాళం వేసి నిరసన తెలపాలి. రుణమాఫీ, పోడు భూముల పట్టాలు, 24 గంటల కరెంటు ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చెట్లకు కట్టేసి నిలదీయాలి. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులు. వారిద్దరిది ఫెవికాల్ బంధం. కాంగ్రెస్‌ది జలయజ్ఞం అయితే.. బీఆర్ఎస్ది ధనయజ్ఞమని" రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇవీ చదవండి :