ఓటుకు నోటు కేసులో బుధవారం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ విచారణకు హాజరయ్యారు. ఆ కేసులో డిజిటల్ సాక్ష్యాలన్నీ సీడీ రూపంలోకి మార్చినట్లు కోర్టుకు అనిశా వెల్లడించింది.
ఎఫ్ఎస్ఎల్ నుంచి ఓ నివేదిక అందగానే సీడీని సమర్పిస్తామని.. కొంత సమయం కావాలని అనిశా న్యాయస్థానానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ రావు తెలిపారు. అంగీకరించిన న్యాయస్థానం విచారణను మార్చి ఒకటికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి : లైవ్ వీడియో.. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి గర్భిణి బలి