మిడ్ మానేరు, గౌరెల్లి, తోటపల్లి ప్రాజెక్టుల్లో వెయ్యి కోట్ల రూపాయల పనులను టెండర్ లేకుండానే గుత్తేదారులకు హరీశ్ కట్టబెట్టాడని విమర్శించారు. అంచనాలు పెంచి పాత కాంట్రాక్టులకు పనులు ఇప్పించడం ద్వారా 600 నుంచి 700 కోట్ల రూపాయలు అక్రమంగా పోగేశారని ఆక్షేపించారు.
హరీశ్ వీడియో బయటపెడతా
అమిత్‌షాతో హరీశ్‌రావు మాట్లాడిన వీడియోకు సంబంధించిన వ్యవహారాన్ని బయటపెడతానని రేవంత్ అన్నారు. ఆ వీడియోను చూసే కేసీఆర్ ఆయన్ని పక్కనపెట్టారని తెలిపారు. నాయిని, కడియం, తుమ్మల నాగేశ్వర్‌రావుకు పదవులు ఉండవని, ఈటల రాజేందర్‌కు 50 శాతం అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి చనిపోతే పరామర్శకు రెండు సార్లు వెళ్లిన సీఎం కేసీఆర్.. జవానులు చనిపోతే నివాళులర్పించడానికి సమయంలేదా అన్ని ప్రశ్నించారు.
నేనే ఆందోళనకు దిగుతా
తెదేపాతో పొత్తుల వల్ల లాభామా నష్టమా అనేది పార్టీ వేదికపై చర్చిస్తామన్న రేవంత్ ... లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై పీసీసీ అధ్యక్షునిదే తుది నిర్ణయమన్నారు. ఎర్రజొన్న రైతుల సమస్యను వారం రోజుల్లో పరిష్కరించకపోతే.. స్వయంగా తానే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. ఈడీ కేసుల్లో బీజీగా ఉండటం వల్ల పార్టీ సమీక్షలకు హాజరుకాలేదని రేవంత్ తెలిపారు.