ETV Bharat / state

ఘట్​కేసర్​ వద్ద కారు ప్రమాదం... విశ్రాంత ఎస్సై దుర్మరణం - crime news in telugu

భువనగిరి నుంచి నగరానికి వస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. సాఫీగా సాగుతున్న వారి ప్రయాణానికి ఓ కుక్క అడ్డు వచ్చింది. అంతే... కారు అదుపు తప్పటం... డివైడర్​ను ఢీకొట్టటం... అందులో ఉన్న ఓ విశ్రాతం ఎస్సై అక్కడే ప్రాణాలొదలటం... కనురెప్పపాటులో జరిగిపోయింది.

retired si died in car accident at ghatkesar

author img

By

Published : Jul 5, 2020, 7:52 PM IST

జాతీయ రహదారిపై కుక్కని తప్పించబోయి ఓ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విశ్రాంత ఎస్సై మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఘట్కేసర్ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ బోరబండకు చెందిన విశ్రాంత ఎస్సై బి.కొండయ్య(63) అదే ప్రాంతానికి చెందిన రోహిత్, మల్లేశ్​, నాగరాజుతో కలిసి భువనగిరి వైపు నుంచి శనివారం అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో కారులో వస్తున్నారు.

ఘట్కేసర్ ఠాణా పరిధిలోని ఎంఎస్సీ నగర్ వంతెన వద్దకు రాగానే ఒక్కసారిగా కుక్క అడ్డు వచ్చింది. కారు నడుపుతున్న రోహిత్... కుక్కను తప్పించే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొండయ్యకు తీవ్ర గాయాలు కావటం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురికి గాయాలు కాగా... స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కొండయ్య కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: వ్యవస్థీకృత జాడ్యాల వికృతరూపం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.