విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.ఎన్.యుగంధర్ (81) కన్నుమూశారు. ఆయన కుమారుడు సత్యనాదెళ్ల ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈఓగా పని చేస్తున్నారు. గతంలో ప్రధాని కార్యాలయ కార్యదర్శిగా యుగంధర్ పనిచేశారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గ్రామీణాభివృద్ధిశాఖలో అనేక కీలక సంస్కరణల అమలుతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. నిజాయితీపరుడు, సమర్థ ఐఏఎస్ అధికారిగా యుగంధర్‌కు గుర్తింపు ఉంది. ప్రణాళిక సంఘం సభ్యుడిగా సమర్థంగా పనిచేశారు. పీవీ నరసింహారావు బృందంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. లాల్‌బహదూర్‌శాస్త్రి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేశారు.
ఇవీ చూడండి:రక్షణ శాఖ ఎస్టేట్స్ డీజీకి కేసీఆర్ లేఖ... ఎందుకంటే...?