ETV Bharat / state

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు పలుగు పట్టిన విశ్రాంత ఉద్యోగి - ఇంకుడు గుంతలు ఏర్పాటు

కాంక్రీట్​ జంగిల్​గా మారిన హైదరాబాద్​ మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఒకప్పుడు 100 అడుగులకే కనిపించిన నీటి జాడ ఇప్పుడు 2 వేల అడుగుల లోతు తవ్వినా చుక్క నీరు రాని పరిస్థితి నెలకొంది.

విశ్రాంత ఉద్యోగి
author img

By

Published : Jul 14, 2019, 9:01 PM IST

హైదరాబాద్​ వనస్థలిపురం గాయత్రినగర్​లోని విశ్రాంత ఉద్యోగి నరసింహ వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేందుకు తన ఇంటి నుంచే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇంట్లో ఉన్న బోరుబావి చుట్టూ ఇప్పటికే ఇంకుడు గుంత తవ్వించిన నరసింహ... ఇంటి ముందు భాగంలో కూడా ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకొని వరద నీటిని ఒడిసిపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంటి ముందున్న సిమెంటు రోడ్డు గచ్చును స్వయంగా పలుగు, పారతో తొలగించారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ఇంకుడు గుంతలు తవ్వాలని సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి మళ్లించేందుకు నరసింహ చేస్తున్న కృషిని జాగృతి అభ్యుదయ సంఘం అభినందించింది.

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు పలుగు పట్టిన విశ్రాంత ఉద్యోగి

ఇదీ చూడండి : 'భాగ్యనగరానికి ఎప్పటికీ నీటి కరవు రాదు'

సికింద్రాబాద్.. సికింద్రాబాద్ చిలుకలగూడ పార్కులో గ్రేటర్ హైద్రాబాద్ విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు .. ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు పెందారం గణేష్ చారి హాజరయ్యారు.. గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్షుడుగా రాళ్లబండి విష్ణు ప్రమణ స్వీకారం చేశారు..నగరానికి చెందిన విశ్వబ్రాహ్మణ నాయకులు హాజరయ్యారు..రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ మన విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు.. ముక్యంగా రాజకీయ రంగంలో ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.. తెలంగాణ రాష్ట్ర సాధనలో మన మనుమయుల పాత్ర ఎంతో ఉంది.. సిద్ధాంత కర్త జయశంకర్ సర్ నుండి ఆత్మహత్య చేసుకొని మలి దశ ఉద్యమాన్ని మలువు తిప్పిన శ్రీకాంత చారి కూడా మన వాడే అని అన్నాడు.. కులం నాకెమిచ్చింది అని కాకుండా కులానికి నేనేమి ఇచ్చాను అని ప్రశ్నించుకోవాలని కోరారు.. అందరిని ఒక్క తాటిపైకి తీసుకురావడమే కాకుండా మన సమస్యలను తీర్చుకోవడం కోసం ప్రభుత్వాన్ని అడుదాం అవసరమైతే పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.