ETV Bharat / state

PULICHINTALA: 'వ్యవస్థలో లోపాలు.. రాజకీయ జోక్యాలే కారణం'

పులిచింతల ప్రాజెక్టులో గేటు విరిగిపోవడానికి నిర్మాణ లోపమే కారణమని, నిపుణుల కమిటీ వేసి సమగ్రంగా అధ్యయనం చేయించాల్సిన అవసరం ఉందని.. విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్‌, డిజైన్స్‌ రంగ నిపుణులు రౌతు సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరిగిన సంఘటనకు గల కారణాలను నిశితంగా పరిశీలించి భవిష్యత్తులో ఏం జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 2002లో సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌గా పదవీ విరమణ చేసిన ఈయన 2007 వరకు డిజైన్స్‌ సలహాదారుగా, 2009 -11 మధ్య ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల సలహాదారుగా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా పలు నిపుణుల కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. పులిచింతల ఘటన నేపథ్యంలో డ్యాంల నిర్వహణ, నిర్మాణంలో లోపాలు తదితర అంశాలపై ఆయన ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

PULICHINTALA
గేటు విరిగిపోవడానికి నిర్మాణ లోపమే కారణం
author img

By

Published : Aug 7, 2021, 9:42 AM IST

ప్రశ్న: పులిచింతల ప్రాజెక్టు గేటు పోవడంలో వైఫల్యం ఎవరిది?

జవాబు: నిర్మాణంలో లోపమే కారణం. డిజైన్‌ సమయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొంటాం. నా ఆధ్వర్యంలో 16 మధ్యతరహా ప్రాజెక్టుల డిజైన్‌, నిర్మాణం జరిగింది. శ్రీపాద ఎల్లంపల్లి మొదట బ్యారేజి. తర్వాత నీటినిల్వను పెంచేందుకు డ్యాంగా మార్చాం. నీటిపారుదల శాఖలోనే కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా అన్ని జాగ్రత్తలతో డిజైన్‌ ఇచ్చాం. పూర్తయి నీరు నిల్వ చేస్తున్నా ఎలాంటి సమస్య లేదు. పులిచింతలకు కూడా నేనే డిజైన్‌ ఇచ్చా. చక్కని ప్రాజెక్టు. నాణ్యంగా కట్టాల్సింది. కానీ దాన్ని చూస్తే గుండె రగిలిపోతుంది. గతంలో గ్రౌటింగ్‌పై సలహాకు పులిచింతల పరిశీలనకు వెళ్లా. నాకు అప్పగించిన పనిలో భాగం కాకపోయినా గేట్లకు సంబంధించిన లోపాలపై ప్రస్తావించా. ప్రస్తుతం చేయగలిగిందేమీ లేదు. సమగ్రంగా పరిశీలించి లోపాలు సరిదిద్ది భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడటం తప్ప.

ప్రశ్న: గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి కదా?

జవాబు: జరిగాయి కానీ ఇలా కాదు. చాలా సంవత్సరాల క్రితం సింగూరు ప్రాజెక్టులో గేటు కొట్టుకుపోయింది. గేటు జాయింట్‌ చేసి వెల్డింగ్‌ చేయడం వల్ల అలా జరిగింది. దీని తర్వాత గేట్ల నిర్మాణంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ఉత్తర్వులు జారీ చేశాం. తర్వాత యోగి వేమన ప్రాజెక్టులో కూడా జాయింట్‌ వెల్డింగ్‌ చేశారు. అక్కడ కూడా పోయింది. అన్నమయ్య ప్రాజెక్టులో కూడా పోయింది. బైరవానితిప్పలో గేట్లు పాతవి. పరిశీలించి గేట్లు మార్చకపోతే కొట్టుకుపోతాయని నివేదిక ఇచ్చాం. పని ప్రారంభించడంలో జాప్యంతో అవి కొట్టుకుపోయాయి. తర్వాత కొత్తవి అమర్చారు. ఇది 2001లో జరిగింది. పులిచింతల వీటికి భిన్నం. శ్రీశైలం తర్వాత పెద్ద గేట్లు ఉన్నది ఇక్కడే. ఈ ప్రాజెక్టులో లోపాలు జరిగాయి. సివిల్‌లోనా, మెకానికల్‌లోనా, అలైన్‌మెంట్‌లోనా లేక వినియోగించిన స్టీలులోనా అని గుర్తించడంతో పాటు మొత్తం ప్రాజెక్టులోని లోపాలపై లోతుగా అధ్యయనం చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ప్రశ్న: ఇలాంటి పరిస్థితికి కారణాలేంటి?

జవాబు: వ్యవస్థలో ఉన్న లోపాలే. రాజకీయ జోక్యం ఎక్కువైంది. ఇంజినీర్లు చెప్పగలిగే స్థితిలో ఉన్నా చూస్తూ ఉండిపోవడం లేదా రాజీ పడిపోవడం జరుగుతోంది. లోపాలను ఎత్తిచూపితే కాంట్రాక్టర్లు తమకున్న రాజకీయ పలుకుబడితో ఇంజినీరును అక్కడ ఉంచరు. ఒక ప్రాజెక్టులో స్టీలు నాణ్యతగా లేదని ఎస్‌.ఇ తిరస్కరిస్తే, వెంటనే కాంట్రాక్టర్‌ ఆయనను బదిలీ చేయించారు. గత కొన్నేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎక్కువైంది. ఒక ప్రాజెక్టు లక్షల మందికి జీవనాధారం. రాష్ట్రాల అభివృద్ధిలో కీలకం. వీటి విషయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మేము సీనియర్లుగా జూనియర్‌ ఇంజినీర్లు, విద్యార్థులకు పాఠాలు చెప్పేటప్పుడు శ్రీశైలం అద్భుత నిర్మాణమని, తప్పకుండా చూడాల్సిన ప్రాజెక్టు అని చెప్తాం. అలాగే సాగర్‌ ప్రాజెక్టు గురించి కూడా. ఒక ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్ని రకాల లోపాలుంటాయో చూడాలంటే కూడా కొన్ని ఉదాహరణలు చెప్తాం. అయితే అలాంటి వాటి పేర్లను నేను ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు.

ప్రశ్న: ప్రాజెక్టుల నిర్వహణ ఎలా ఉంది?

జవాబు: నిర్వహణ చాలా ముఖ్యం. కానీ ఇందుకు అవసరమైన సిబ్బంది లేరు, నిధులు ఇవ్వడం లేదు. ఎక్కువ ప్రాజెక్టుల్లో ఇదే పరిస్థితి. మధ్యతరహా ప్రాజెక్టుల పరిస్థితి మరీ దయనీయం. వర్షాకాలానికి ముందు, తర్వాత కూడా గేట్లను పరిశీలించి సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేదంటే వరద వచ్చినపుడు గేటు లేవకపోవడం లాంటి సంఘటనలు ఎదురవుతాయి. అనేక ప్రాజెక్టుల్లో నిర్వహణ సమస్య తీవ్రంగా ఉంది. ఎలక్ట్రీషియన్‌, వాచ్‌మెన్‌, ఇతర సిబ్బంది ఉండాలి. ఇంజినీర్లు ఉన్నంత మాత్రాన సరిపోదు. చాలా చోట్ల ఔట్‌సోర్సింగ్‌లో నియమిస్తున్నారు. వారికి వేతనం కూడా సరిగా ఇవ్వరు. ఉత్తరాంధ్రలో వరద వచ్చినపుడు ఓ మధ్యతరహా ప్రాజెక్టు వద్ద ఓ మహిళా డి.ఇ, ఇంకో ఎ.ఇ మాత్రమే ఉన్నారు. ఇతర సిబ్బంది లేరు. ఏమి చేయాలో దిక్కుతోచక భయంతో వాళ్లిద్దరే కష్టపడి సగం గేటు లేపారు. నీరు ఓవర్‌ప్లో అయ్యింది. ప్రమాదం తప్పింది. ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టు వద్ద నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించి నిర్వహణకు నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వాలి. గతంలో నీటి తీరు వల్ల కొంత డబ్బు వచ్చి నిర్వహణకు ఉపయోగపడేది. ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి ప్రభుత్వమే సకాలంలో విడుదల చేయాలి.

ఇదీ చూడండి: PULICHINTALA: ప్రాజెక్టు ఎంత భద్రమో సమగ్ర అధ్యయనమే మేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.